TDP Leaders Fire on YSRCP Leaders : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధికార యంత్రాంగం వక్రభాష్యం చెబుతోందని ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు అంశాలను ఎవరికి నచ్చినట్టు వాళ్లు రాయడానికి వీలు లేదని గుర్తు చేశారు. ఈ కేసులో సెక్షన్ 17A వర్తింపునకు సంబంధించి ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారని వివరించారు.
చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు : అబద్ధాలు, అసత్య ప్రచారాలే అజెండాగా వైఎస్సార్సీపీ నేతలు, మంత్రులు పని చేస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టు తీర్పులకు కూడా వక్రభాష్యాలు చెప్పడం వైఎస్సార్సీపీ నేతలకు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అధికార పార్టీ నేతలు వక్రభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు క్వాష్ పిటిషన్ - ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో సీజేఐ ముందుకు
సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా అరెస్టు జరిగిన ఈ కేసులో 17Aపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ అభిప్రాయాలు చెప్పారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఇప్పటికీ ఒక్క ఆధారం చూపలేదన్నారు. ఈ కేసుల్లో నిధుల దుర్వినియోగం అయినట్లు కానీ పక్కదారి పట్టినట్లు కానీ ఇప్పటికీ నిరూపించలేకపోయారని విమర్శించారు. కేవలం రాజకీయ కక్షతో చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని దుయ్యబట్టారు. దీంట్లో ఎప్పటికీ సఫలం కాలేరని అచ్చెన్నాయుడు అన్నారు.
పదేళ్లుగా తప్పించుకుంటున్న జగన్ : మంత్రి అంబటి రాంబాబు అప్పుడప్పుడూ నిజాలే చెబుతారనిమాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నేరస్థుడిని ఏ న్యాయస్థానం కాపాడదంటూ రాంబాబు చేసిన ట్వీట్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. 32 కేసులు, 16 నెలల జైలు జీవితం, పదేళ్లుగా బెయిల్ వీటన్నింటి నుంచి జగన్ తప్పించుకోలేకపోయారన్న విషయాన్ని రాంబాబు చెబుతున్నారని సోమిరెడ్డి ట్వీట్ చేశారు.
-
అదేంటో మా సంబరాల రాంబాబు అప్పుడప్పుడూ నిజాలే చెబుతాడు. 32 కేసులు, 16 నెలల జైలు జీవితం, పదేళ్లుగా బెయిల్..ఇవన్నీ తప్పించుకోలేకపోయారుగా.. https://t.co/rlTH0upWmJ
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) January 16, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">అదేంటో మా సంబరాల రాంబాబు అప్పుడప్పుడూ నిజాలే చెబుతాడు. 32 కేసులు, 16 నెలల జైలు జీవితం, పదేళ్లుగా బెయిల్..ఇవన్నీ తప్పించుకోలేకపోయారుగా.. https://t.co/rlTH0upWmJ
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) January 16, 2024అదేంటో మా సంబరాల రాంబాబు అప్పుడప్పుడూ నిజాలే చెబుతాడు. 32 కేసులు, 16 నెలల జైలు జీవితం, పదేళ్లుగా బెయిల్..ఇవన్నీ తప్పించుకోలేకపోయారుగా.. https://t.co/rlTH0upWmJ
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) January 16, 2024
చంద్రబాబు క్వాష్ పిటిషన్ తీర్పుపై హైకోర్టు న్యాయవాదులు ఏమన్నారంటే ?
గుడివాడ అమర్నాథ్‌పై ఆగ్రహం : సుప్రీంకోర్టు తీర్పునకు వక్రభాష్యం చెబితేనైనా జగన్ తనకు సీటు ఇస్తారన్న నమ్మకంతో మంత్రి గుడివాడ అమర్నాథ్ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తెలుగుదేశం నేత అమర్నాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
ఏంటి @ysjagan , ఈ ఆంబోతు నిన్ను అంత మాట అనేసాడు ?.. @AmbatiRambabu https://t.co/R2OvC9UNCa pic.twitter.com/4tpwu7k9Kb
— N Amarnath Reddy (@NAmaranathReddy) January 16, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఏంటి @ysjagan , ఈ ఆంబోతు నిన్ను అంత మాట అనేసాడు ?.. @AmbatiRambabu https://t.co/R2OvC9UNCa pic.twitter.com/4tpwu7k9Kb
— N Amarnath Reddy (@NAmaranathReddy) January 16, 2024ఏంటి @ysjagan , ఈ ఆంబోతు నిన్ను అంత మాట అనేసాడు ?.. @AmbatiRambabu https://t.co/R2OvC9UNCa pic.twitter.com/4tpwu7k9Kb
— N Amarnath Reddy (@NAmaranathReddy) January 16, 2024
Chandrababu Quash Petition Judgement : స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో జస్టిస్ అనిరుద్ధబోస్ (Justice Aniruddha Bose), జస్టిస్ బేలా ఎం. త్రివేది (Justice Bela M.Trivedi)లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్ 17Aలో పేర్కొన్న అంశాల ప్రకారం కేసు నమోదుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టం చేశారు. లేదంటే దాని విచారణ, దర్యాప్తు చట్టవిరుద్ధం అవుతాయని అన్నారు.
సెక్షన్ 17A సెక్షన్ రావడానికి ముందు జరిగిన నేరాలకు, ఈ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం. త్రివేది పేర్కొన్నారు. సెక్షన్ 17A వర్తింపజేసే అంశంపై న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో, ఈ కేసును తదుపరి విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తికి నివేదిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. రిమాండు ఉత్తర్వులు కొట్టేయడానికి ఇద్దరు న్యాయమూర్తులు నిరాకరించారు.
చంద్రబాబు క్వాష్ పిటిషన్ - సీజేఐకి నివేదించిన ద్విసభ్య ధర్మాసనం