Devineni Uma comments on CM Jagan: పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ఈ నెల 10వ తేదీన మైలవరం సబ్ స్టేషన్ వద్ద నిర్వహించే ధర్నాలో మండలాల వారీగా పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొనాలని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు పిలుపునిచ్చారు. నాలుగేళ్ళలో మద్యం అమ్మకాలపై 41వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్‌కి వెళ్ళాయని ఆరోపించారు. బాబాయి హత్య కేసులో ముద్దాయిలను పట్టుకోవడం చేతకాని నీకు అధికారం కావాలా అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఇప్పటి వరకు బటన్లు మీరు నొక్కారు.. ఇంక ఆఖరి బటన్ ఎన్నికల్లో ఈవీఎంపై ప్రజలు నొక్కుతారని తెలిపారు. 151 సీట్లలో అటు ఒకటి ఇటు ఒకటి పోయి 5 సీట్లే ఉంటాయి. ఆ 5 సీట్లలో పులివెందుల ఉండదని ఎద్దేవా చేశారు. వై నాట్ కుప్పం కాదు, వై నాట్ పులివెందుల అని ఆక్షేపించారు. టీడీపీపై బురదజల్లడం, అవినీతి ఆరోపణలు చేయడం, నాయకులను జైళ్లల్లో పెట్టడం తప్ప ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన వైసీపీ నాయకులకు లేదని.. అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎన్ని సార్లు రాజీనామా డ్రామాలు ఆడతావని నిలదీశారు. రాజధాని విషయంలో మీ రాజీనామా ఏమైంది.. నీ బంధువులు మైనింగ్‌లో లేరా అని ప్రశ్నించారు. పోసాని కోటేశ్వరరావు ఎవరు, మైలవరం ఇన్చార్జి నారాయణ ఎవరని అన్నారు. మీ రాజీనామాల డ్రామాలు ఆపి అక్రమ మైనింగ్‌పై దోచుకున్న లెక్కలు బయట పెట్టండి అని అన్నారు. ఇప్పటి వరకు మీరు అక్రమంగా దోచుకున్న కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి, అక్రమ మైనింగ్ దోషులను పట్టుకోవాలని కోరారు.
వైసీపీ సరికొత్త మోసానికి తెరతీస్తుంది.. ‘ముఖ్యమంత్రి జగనే మా నమ్మకమంటూ వైసీపీ నాయకులు ప్రజల ఇంటి తలుపులకు స్టిక్కర్లు వేస్తున్నారు. ప్రజలేమో నువ్వు మా నమ్మకం కాదు.. మా దరిద్రం అంటున్నార’ని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు.. వైసీపీ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టరు పేరిట సరికొత్త మోసానికి తెరతీసిందన్నారు. ఆరోగ్యశ్రీతో ఎంతమందిని ఉద్ధరించారు? ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులు ఎందరికి అందుతున్నాయని ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో ఉద్యోగులకు భద్రత లేకుండా చేశారని విమర్శించారు. సీఎం సభలకు వినియోగించుకున్న ఆర్టీసీ బస్సులకు ఎంత చెల్లించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసేందుకు, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచేందుకు శాసనసభ నియోజకవర్గ పరిధిలో సాధికార సారథి విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ అధినాయకత్వం ప్రకటించిందని వివరించారు. ఒక్కో సాధికార సారథి 30 కుటుంబాలకు అండగా ఉంటారని చంద్రబాబు ప్రకటించారని తెలిపారు.
ఇవీ చదవండి: