TDP Leaders New Year Wishes : తెలుగు ప్రజలందరికీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023లో అందరికీ శుభాలే కలగాలని అచ్చెన్నాయుడు అన్నారు. కొత్త ఏడాది మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు. గత సంవత్సరం కూడా ప్రతి ఏడాది లాగే జగన్ రెడ్డి కలకల జనం బ్రతుకులు విలవిలలా సాగిందన్నారు. ఈ ఏడాది జగనాసుర పాలనకు అంతం పలికి ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు.
కాలం అనే పరుగులో ఒక ఒక ఏడాది ముగిసింది, గత సంవత్సరం చేదు జ్నాపకాల్ని వదిలేసి నూతన లక్ష్యాలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెడతామని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఈ నూతన సంవత్సరంలో మీ కలలు నిజం అవ్వాలని, మీ ప్రతి అడుగూ విజయమనే గమ్యం వైపు సాగాలని అన్నారు.
ఇవీ చదవండి: