Somu Veerraju: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల ప్రమేయం అధికంగా ఉంటోందని నిరూపిస్తే సీఎం రాజీనామా చేస్తారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మిల్లర్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని.. మిల్లర్లు లేకుండా మనుగడ సాగించే పరిస్థితి ప్రభుత్వంలో లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్య సేకరణ చేతకాకుంటే కేంద్రానికి ఇస్తే ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేస్తుంది.
ఈనెల 27న బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఏలూరులో బీసీ సామాజిక చైతన్య సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేసింది ఏమి లేదని విషయాన్ని ప్రజలముందు కేంద్ర మంత్రితో పాటు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ అతిధులుగా పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో రైతులుకు ఇచ్చే భూ హక్కు పత్రాలు పంపిణీలో చాలా తప్పులు ఉంటున్నాయని.. పేదలకిచ్చే భూములను చుక్కల భూముల పేరుతో స్థానిక వైసీపీ నేతలే స్వాహా చేస్తున్నారని విమర్శించారు. వివాదాలను తొలగించి, భూ హక్కు కల్పించడానికి ప్రధాని మోదీ ఈ పథకం ప్రవేశపెట్టారని.. దీనినీ జగన్మోహన్రెడ్డి తన ఫోటోతో తన సొంత పథకంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
ఇవీ చదవండి: