ETV Bharat / state

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. భాజపా తరపున కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి పోటీ చేయడం.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కాంగ్రెస్​లో ఉండడంతో రోజుకో పరిణామం చోటు చేసుకుంటోంది. వెంకట్​రెడ్డి కాంగ్రెస్​ తరపున ప్రచారం నిర్వహించకపోవడం.. మరోవైపు తన సోదరుడికే ఓటు వేయాలంటూ ఆడియో ప్రచారం కొనసాగుతోంది. దీంతో కాంగ్రెస్​ అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉంది.. అసలు ఏం జరిగిందో వివరణ ఇవ్వాలని వెంకట్​రెడ్డికి నోటీసులు ఇచ్చింది.

author img

By

Published : Oct 23, 2022, 3:27 PM IST

komatireddy venkat reddy
komatireddy venkat reddy

Show Cause Notices to Komatireddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం నోటీసు ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతుందంటూ ఇటీవల ఓ కార్యకర్తతో కోమటిరెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న వాయిస్‌ క్లిప్‌ వైరల్‌ అయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయనను వివరణ కోరింది. ఈ మేరకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఏఐసీసీ కార్యదర్శి తారిఖ్‌ అన్వర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

రాజగోపాల్‌ రెడ్డికి ఓటేయాలని వెంకటరెడ్డి చెప్పిన వాయిస్ రికార్డ్‌ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిందని తెలిపారు. ఇది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుందని ఏఐసీసీ కార్యదర్శి స్పష్టం చేశారు. పది రోజుల్లో ఎందుకు చర్య తీసుకోరాదో వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి జారీ చేసిన నోటీసులో తెలిపారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.