Red Sandalwood Sales in AP: రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఎర్రచందనం దుంగలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అటవీశాఖ డిపోలకే పరిమితమై పాడైపోతున్నాయి. ఏపీ అటవీశాఖ సెంట్రల్ స్టోర్స్‌లో సుమారు 7వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగల నిల్వలు ఉన్నాయి.
YCP Govt Ignores Red Sandalwood Reserves: 5వేల 5వందల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం విక్రయానికి డీజీఎఫ్టీ అనుమతులు ఇచ్చినప్పటికీ.. ఏపీఎఫ్డీసీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతోంది. ఈ ఏడాది కేవలం 5వందల మెట్రిక్ టన్నుల దుంగలను మాత్రమే విక్రయించింది. గ్రేడింగ్, వేలం విధానంలో లోపాల వల్ల వేల టన్నుల ఎర్రచందనం నిల్వ ఉండిపోయింది.
తిరుమలలో ఎర్రచందనం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
Red Sandalwood Reserves in AP: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఎర్రచందనం నిల్వలు పెరిగిపోతున్నాయి. తిరుపతి, కడప, నెల్లూరు,చిత్తూరు జిల్లాల్లోని అటవీశాఖ డిపోల్లో ఎర్రచందనం దుంగలు పెద్ద ఎత్తున్న నిల్వ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వాటిని విక్రయించేందుకు కేంద్రం ఎఫ్ఎస్టీసీని నోడల్ ఏజెన్సీగా నియమించింది.
5వేల5వందల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం విక్రయానికి.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అనుమతి ఇచ్చినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎర్రచందనం దుంగలు వేలం వేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. గ్రేడింగ్ విధానం, వేలం ప్రక్రియలో అసంబద్ధమైన నిబంధనల కారణంగా వేల టన్నుల దుంగలు గోదాములకే పరిమితమయ్యాయి.
ఎర్రచందనం తరలిస్తున్న ఐదుగురి అరెస్టు, నాలుగు కోట్ల విలువైన 275 దుంగలు స్వాధీనం
Red Sandalwood Sales: రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకూ కేవలం 5వందల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను మాత్రమే విక్రయం చేయగలిగింది. వాస్తవానికి ఎఫ్ఎమ్టీసీ నోడల్ ద్వారా ఎర్రచందనం విక్రయంతో రాష్ట్రానికి 5వేల కోట్ల రూపాయలు రెవెన్యూ ఆర్జించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. స్మగ్లింగ్, అక్రమ రవాణాలో పట్టుకున్న ఎర్రచందనం దుంగలను.. రెడ్ సాండర్స్ సెంట్రల్ స్టోర్స్‌కు తరలించి విక్రయానికి అనుమతులు తీసుకుంటారు. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్ఎమ్టీసీ ద్వారా చైనా, జపాన్, థాయ్ లాండ్ , మలేసియా లాంటి దేశాలకు విక్రయిస్తారు.
విదేశాల్లో ఎర్రచందనానికి మంచి గిరాకీ ఉంది. 2021లో 318టన్నుల 447కిలోల ఎర్ర చందనం దుంగలు వేలం ద్వారా విక్రయించారు. కానీ ప్రస్తుతం ఏపీ అటవీశాఖ సెంట్రల్ స్టోర్స్‌లో 7వేల మెట్రిక్ టన్నులకు పైగా ఎర్ర చందనం దుంగలు నిల్వ ఉన్నాయి.
Red Sandalwood Reserves in AP:రాష్ట్రానికి వేల కోట్లు ఆదాయం ఇచ్చే ఎర్రచందనం వేలంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే దుంగలు అటవీశాఖ డిపోల్లో వృధాగా పాడవుతున్నాయి. ఎర్రచందనం విక్రయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండకుండా.. వాటిని విక్రయించి రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గం చూడాలని పలువురు కోరుతున్నారు.