Rashtriya Brahmana Sanghatan: వైసీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంక్షేమానికి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన్ నేతలు విమర్శించారు. ఇద్దరికి పదవులు ఇస్తే మొత్తం బ్రాహ్మణులను ఉద్దరించినట్టేనా? అని ప్రశ్నించారు. అర్చకులు, పూజారులపై దాడులు కొనసాగుతున్నాయని, బ్రాహ్మణలను కక్షపూరితంగా అణగదొక్కుతున్నారని, అందరూ ఇదేం ఖర్మ జగన్ అనుకుంటున్నారని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. టీడీపీ హయాంలో 285 కోట్ల రూపాయలతో లక్ష 62 వేల మందికి ప్రయోజనం కలిగించారని.. విదేశీ విద్య ద్వారా లబ్ధి చేకూర్చినా ఈ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయకుండా నీరుగార్చిందని బ్రాహ్మణ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య విమర్శించారు.
ఇవీ చదవండి