modi speech at begumpet : తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. బేగంపేట విమానాశ్రయ ప్రాంగణంలో జరిగిన స్వాగత సభలో పాల్గొన్నారు. తెలంగాణలో భాజపా కార్యకర్తలు వేధింపులు, దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ పేరుపై అధికారంలోకి వచ్చిన పార్టీ... తాను మాత్ర అభివృద్ధి చెంది ప్రజలను వెనక్కి నెట్టిందని ఆరోపించారు. తెలంగాణలో నెలకొన్న అంధకారం తొలగిపోయే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. కమలవికాసంతో సూర్యోదయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
modi Telangana visit : మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు భాజపాకు ఒక భరోసా ఇచ్చారని హర్షం వ్యక్తంచేశారు. భాజపా శ్రేణులు ఒక అసెంబ్లీ సీటు కోసం తెలంగాణ సర్కారు మొత్తం మునుగోడుకు వెళ్లేలా చేశారని తెలిపారు. తెలంగాణలో మూఢవిశ్వాసకులను సాగనంపుతుందని... ప్రధాని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజలను లూటీ చేసే ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
తన తొలి ప్రాధాన్యత ప్రజలకే.. కుటుంబానికి కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తెలంగాణను అవినీతి, కుటుంబ పాలన నుంచి రక్షించటమే నా లక్ష్యమని తెలిపారు. నన్ను, భాజపాను ఎన్ని తిట్టినా పట్టింటుకోనని... ప్రజలను తిడితే మాత్రం సహించని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను బూత్‌బూత్‌కు వెళ్లి వివరించాలని భాజపా కార్యకర్తలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. పథకాలు అందని వారికి అందేలా చూడాలని సూచించారు.
"తెలంగాణ భాజపా కార్యకర్తలు బలమైన శక్తులు, ఎవరికీ భయపడరు. అభివృద్ధి వ్యతిరేకులతో తెరాస సర్కారు జతకట్టింది. నన్ను, భాజపాను ఎన్ని తిట్టినా ఫర్వాలేదు. ప్రజలను తిడితే మాత్రం సహించను. మోదీని తిట్టేవాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ తిట్లను నేను పెద్దగా పట్టించుకోను. తెలంగాణ ప్రజలను తిడితే మాత్రం సహించేది లేదు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి." అని మోదీ హెచ్చరించారు.
ఇవీ చదవండి :