Power Cuts in AP: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో అప్రకటిత విద్యుత్ కోతలు అధికమయ్యాయి. రాత్రిపూట కోతలు విధించడంతో ఉక్కపోత, దోమల కాట్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత నాలుగైదు రోజులుగా ఉరవకొండ పరిసరాలలో విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. శనివారం ఉరవకొండ పట్టణంతో పాటు రాత్రి 8:00నుంచి 8:40 వరకు విద్యుత్ కోత విధించారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువ సమయం కోత కొనసాగింది. వీధుల్లో నెలకొన్న చీకట్లో ఏమి జరుగుతుందో, ఎవరు సంచరిస్తున్నారో, ఎక్కడ విషపురుగులు వస్తాయని పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి 8:00 గంటల ప్రాంతంలో విద్యుత్తు సరఫరా (Latest News of Power Cuts) నిలిపివేయడం వల్ల ట్యూషన్ నుంచి చిన్నారులు చీకటిలో ఇళ్లకు చేరుకోవడానికి విద్యార్థులు.
Electricity Cuts in YSRCP Government : నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం లోని పలు మండలాల్లో వర్షం కురుస్తుంటే మరోపక్క విద్యుత్ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేశాయి. రాత్రి అయితే చాలు సుమారు రెండు గంటల పాటు విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుంది. మర్రిపాడు, ఏఎస్ పేట, చేజర్ల మండలాల్లో ఏడు నుండి 9 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు
Power Cuts in YCP Government అప్రకటిత 'జగనన్న విద్యుత్ కోతల' పథకంతో.. అల్లాడిపోతున్న జనం!
విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట నిరసన : విద్యుత్ కోతలకు నిరసనగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చింతలపాడులో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ తిరువూరు-గంపలగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. టీడీపీ తిరువూరు నియోజకవర్గం ఇంచార్జ్ శావల దేవదత్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. గ్రామాల్లో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. అధికారులకు చెప్పినా ఫలితం ఉండటం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు.
దోమలతో సహవాసం : విశాఖ జిల్లా పరిధిలోని గ్రామాలు పట్టణాలలో సైతం అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. దీనికి తోడు వేలాది రూపాయలు కరెంట్ బిల్లులు మరింత భారాన్ని పెంచుతున్నాయని వినియోదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు చిన్న పిల్లలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. రోజువారి కూలీలు రాత్రులు అప్రకటిత విద్యుత్ కోతలతో సక్రమంగా నిద్ర పట్టక ఉదయాన్నే పనులకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు దోమలతో సహవాసం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తద్వారా అనారోగ్యాల పాలవుతున్నామని ఆందోళన చెందుతున్నారు.
ప్రధాని రహదారిపై కొవ్వొత్తులతో ర్యాలీ : విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రం గజపతినగర ప్రధాన రహదారిపై అప్రకటిత విద్యుత్ కోతలపై తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసనకు దిగారు. ఈ దుర్మార్గపు పాలన చీకటిమయం అవడానికి ఇదే కారణమని.. దీని వలన విద్యార్థులు, చిన్న పిల్లలు, వృద్ధులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేఏ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు శ్రేణులతో కలిసి ప్రధాని రహదారిపై కొవ్వొత్తులతో ర్యాలీగా వెళ్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముందు సమాచారం ఇస్తే జాగ్రత్త పడతాం : అనధికార విద్యుత్ కోతలతో అన్ని విధాలుగా అగచాట్లకు గురవుతున్నామని.. గతంలో ఎన్నడూ లేని విధంగా కోతలు విధిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్తు కోతలు లేకుండా చేయాలని కోరుతున్నారు. విద్యుత్ కోతలు విధించే (Power Cut Timings Today) ముందు ప్రజలకు సమాచారం ఇస్తే జాగ్రత్త పడి ముందే పనులు చేసుకుంటామని ప్రజలు అంటున్నారు.