ETV Bharat / state

Ambedkar Jayanthi : "భేద భావాలు మరిచేలా .. మానవత్వం పరిఢవిల్లేలా చేసిన అంబేడ్కర్ కృషి మరువలేం" - డాక్టర్​ బాబ సాహెబ్​ అంబేడ్కర్​ జయంతి

Tributes to Ambedkar : భారత రాజ్యాంగ నిర్మాత, హక్కుల సారథి డాక్టర్​ బాబా సాహెబ్​ అంబేడ్కర్​ జయంతి సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లెందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.

Tributes to BR Ambedkar
Tributes to BR Ambedkar
author img

By

Published : Apr 14, 2023, 3:49 PM IST

Cm Jagan on BR Ambedkar : భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్‌కు ముఖ్యమంత్రి జగన్ నివాళులు అర్పించారు. దేశం గర్వించదగ్గ మేధావుల్లో అంబేడ్కర్ అగ్రగణ్యుడు, మహోన్నతుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి అని సీఎం కొనియాడారు. న్యాయ, సామాజిక , ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాల్లో అపార జ్ఞానశీలి అని.. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత అని ప్రశంసించారు. భేద భావాలు మరిచేలా ..మానవత్వం పరిఢవిల్లేలా అంబేడ్కర్ చేసిన కృషి మరువలేమన్నారు. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకేశామని ట్వీట్‌లో సీఎం తెలిపారు.

  • భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేం. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకేశాం. అంబేద్కర్‌ జయంతి సంద‌ర్భంగా ఆయనకు ఘన నివాళులు. 2/2#AmbedkarJayanti

    — YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chandrababu Tributes to Ambedkar : సమాజంలోని అసమానతలను తొలగించడానికి అందరికీ ఆమోద యోగ్యమైన చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచిన మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. అంబేడ్కర్ స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ దళితులకు అన్ని విధాలా ప్రాముఖ్యతను ఇచ్చిందన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా చంద్రబాబు ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పించారు. అంబేడ్కర్ గొప్పదనాన్ని భావితరాలకు తెలియజేయాలనే ఆలోచనతో అమరావతిలోని దళితులు ఎక్కువగా ఉన్న శాఖమూరుని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతూ.. 100 కోట్ల రూపాయలతో 20 ఎకరాల్లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, లైబ్రరీ, పార్కుతో కూడిన స్మృతివనం ఏర్పాటుకు ఆనాడు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. పేద విద్యార్ధులకు విదేశీ విద్య అందించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఏ ఊరిలో అభివృద్ధి పనులు చేపట్టినా వాటిని మొదటగా దళిత వాడ నుంచి మొదలెట్టే సంప్రదాయాన్ని తెచ్చామన్నారు. ఇక ముందూ అంబేడ్కర్ స్ఫూర్తితో దళిత సంక్షేమానికి టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • అంబేద్కర్ గొప్పదనాన్ని భావితరాలకు తెలియజేయాలనే ఆలోచనతో
    అమరావతి లోని దళితులు ఎక్కువగా వున్న శాఖమూరుని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతూ... రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, లైబ్రరీ, పార్కుతో కూడిన అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకు ఆనాడు శ్రీకారం చుట్టాం(2/3)

    — N Chandrababu Naidu (@ncbn) April 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంబేడ్కర్​ చిత్రపటానికి లోకేశ్​ నివాళులు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పూలమాల వేసి నివాళులర్పించారు. నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గంలో లోకేశ్‌ పాదయాత్ర 70వ రోజుకు చేరుకోగా.. గుడిపాడు క్యాంప్ సైట్‌ వద్ద అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డోన్‌ టీడీపీ ఇంఛార్జ్‌ సుబ్బారెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ నేతలు పాల్గొన్నారు.

  • స్వేచ్ఛా, స‌మాన‌త్వం, పౌర‌హ‌క్కులు రాజ్యాంగం ద్వారా క‌ల్పించిన మాన‌వ‌తామూర్తి అంబేద్క‌ర్ మ‌హాశ‌యుడి ఆశ‌య‌సాధ‌న‌కి కృషి చేద్దాం. వివ‌క్ష‌, పేద‌రికంలేని స‌మాజం నిర్మించుదాం. జై భీమ్‌.(2/2)#AmbedkarJayanti

    — Lokesh Nara (@naralokesh) April 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Pawan Tributes to Ambedkar: భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్​ కల్యాణ్​ తెలిపారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని జనసేన పార్టీ తరపున హామీ ఇస్తున్నట్లు ఈ మేరకు ట్వీట్​ చేశారు.

  • భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నాం.#Ambedkar
    #AmbedkarJayanti pic.twitter.com/cY1bVYQpFD

    — JanaSena Party (@JanaSenaParty) April 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.