ETV Bharat / state

ganja smuggling రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా పట్టివేత..! - జిల్లా వార్తలు

smuggling network: రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని ప్రకటిస్తున్నా.. గంజాయి అక్రమ రవాణకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నేడు ఒక్కరోజే నాలుగు జిల్లాలో గంజాయి అక్రమ రవాణను పోలీసులు అడ్డుకున్నారు. గంజాయి రవాణ చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

smuggling network
smuggling network
author img

By

Published : Jul 8, 2023, 8:04 PM IST

police bust Ganja smuggling network: రాష్ట్రవ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాపై పోలీస్​లు ఉక్కుపాదం మోపుతున్పారు. వివిధ జిల్లాల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న పలువురిని అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నేడు ఒక్కరోజే ఎన్టీఆర్, కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో దాడులు నిర్వహించి పలు చోట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న 11మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4కేజీల గంజాయితో పాటుగా.. రెండు బైక్ స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కొందరు గంజాయి విక్రయిస్తూ, సేవిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. యువత మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాలకు బానిస కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పోలీసులు వెల్లడించారు. గంజాయి విక్రయించినా... లేదా పట్టుబడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ... మదనపల్లెకు చెందిన దంపతులు ఆంధ్రా, ఒడిశా బోర్డర్ నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నారని వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాపై పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గంజాయి కొనుగోలు కోసం వచ్చిన మరో నలుగురిని సైతం అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. ఓ వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిలో ఓ మహిళతో పాటుగా.. ఓ మైనర్ కూడా ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. వీరికి గంజాయి సరఫరా చేసే వారిని సైతం గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని వెల్లడించారు. యువత గంజాయికి అలవాటుపడి జీవితాల్ని నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో పోలీసులు 27 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదు వ్యక్తులను అరెస్ట్ చేశారు. డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాకు చెందిన ఒక వ్యక్తి నుంచి 27 కేజీల గంజాయిని.. పురుషోత్త పురం, సుమాడి గ్రామాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు కొనుగోలు చేశారని తెలిపారు. ఆ గంజాయిని చిన్న పొట్లాలుగా చేసి అమ్మెందు ప్రణాళిక వేసుకున్నారని, డీఎస్పీ వెల్లడించారు. సమాచారం అందుకున్న ఇచ్చాపురం పోలీసులు వారిని అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. గంజాయి అమ్మకానికి పాల్పడిన ఒడిశాకు చెందిన ఏ6 గా ఉన్న వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నారని డీఎస్పీ వెల్లడించారు. అతడిని సైతం త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.