ETV Bharat / state

Munneru Project: మున్నేరు ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయండి మహాప్రభో: రైతులు

NTR distric Munneru project latest news: మున్నేరు ప్రాజెక్ట్‌ను పూర్తి చేయండి మహాప్రభో అంటూ.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రాజెక్ట్ పూర్తైతే రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులు బాగుపడుతారని గుర్తు చేస్తున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంపై గత కొన్నేళ్లుగా రైతులు పెట్టుకున్న ఆశలను నిరాశలు చేయొద్దంటూ కోరుతున్నారు.

Munneru Project
Munneru Project
author img

By

Published : Apr 18, 2023, 10:03 PM IST

NTR distric Munneru project latest news: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు జలయజ్ఞం కార్యకమంలో భాగంగా మొదటి ప్రాజెక్ట్‌గా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి వద్దనున్న మున్నేరు ప్రాజెక్టు ఎత్తును పెంచడానికి నిర్ణయించారు. దీంతో ఆయా ప్రాంత రైతులు ప్రాజెక్ట్ పూర్తయితే తమకు సాగునీరు అందుతుందని ఎంతో ఆనందపడ్డారు. కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రాజెక్ట్ నిర్మాణ పనులను గాలికొదిలేశాయి. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మున్నేరు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తారని భావించిన ఆ ప్రాంత రైతులంతా.. వైఎస్సార్సీపీకి ఓట్లు వేసి గెలిపించారు. సీఎంగా జగన్.. అధికారం చేపట్టి నాలుగేళ్లు గడిచినా కూడా నేటీకి ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. 2012లో వరదలకు ఏర్పడినా గండి పూడ్చడానికి రూ. 5.25 కోట్లతో పనులను ప్రారంభించినప్పటికీ అవి మధ్యలోనే నిలిచిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

మున్నేరు ప్రాజెక్ట్‌పై రైతుల ఆశలు నిరాశలు.. ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి తండ్రి (దివంగత రాజశేఖర్ రెడ్డి) ప్రారంభించిన ప్రాజెక్ట్‌ని కుమారుడు ముఖ్యమంత్రి అయితే పూర్తి చేస్తారన్న నమ్మకంతో మున్నేరు ప్రాజెక్ట్ ఆయకట్టు ప్రాంత రైతులు ఓట్లేసి గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా సీఎం జగన్.. నేటికీ ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేదు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తానని హామీ ఇచ్చిన.. సామనేని ఉదయబాను మాట నిలబెట్టుకోలేకపోయారు. దీంతో మున్నేరు ప్రాజెక్ట్ పూర్తయితే తమ పొలాలకు సాగునీరు అందుతుందని.. రైతులు పెటుకున్న ఆశలు గత కొన్నేళ్లుగా నిరాశగానే మిగిలిపోయాయి. ఈ ప్రాజెక్ట్ గనక పూర్తయితే.. ఇటు ఆంధ్ర ప్రాంత రైతులు అటు తెలంగాణ రాష్ట్రంలోని రెండు మండలాల రైతులకు లాభం చేకూరుతుందని రైతులు తెలియజేశారు.

బ్రిటీష్​ హయాంలో మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణం.. మున్నేరు ప్రాజెక్టు పూర్తయితే.. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో సుమారు 80వేల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందించవచ్చు. రెండు నియోజకవర్గాల్లో ఇంచుమించు అన్ని మండలాల్లో రెండు పంటలు సాగవుతాయి. ప్రాజెక్టు పూర్తిచేస్తే ఆయకట్టు ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చవచ్చు. తెలుగుదేశం పాలనలో నేతలు చొరవ చూపినప్పటికీ పనులు చేపట్టలేకపోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వమైనా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తారని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది.

ఈ నేపథ్యంలో పలువురు రైతులు మాట్లాడుతూ.. గతంలో మున్నేరు ప్రాజెక్టుని బ్రిటీషు పాలకులు నిర్మించారని తెలిపారు. ఆనాడే 16,427 ఎకరాలకు సాగునీరును అందించాలన్న లక్ష్యంతో బ్రిటీషు పాలకులు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మొదలుపెట్టారన్నారు. 2004లో నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ మున్నేరు ప్రాజెక్టుని పూర్తి చేసి సుమారు 80 వేల ఎకరాల ఆయకట్టుకి సాగునీరును అందించాలని భావించారని గుర్తు చేశారు. అందుకు సంబంధించిన పనులను కూడా ప్రారంభించి.. సగం పనులు పూర్తి చేశారన్నారు. ఆ తర్వాత సుమారు ఇరవై సంవత్సరాలు పూర్తియినా కూడా నేటికీ ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదని వాపోయారు.

ఆ నాలుగు మాసాల్లోనే భారీ వరద వస్తుంది.. రెండు దశాబ్దాల కిందట గోడ ఎత్తు కొంత పెంచారు. సుమారు 134 ఏళ్ల క్రితం బ్రిటీషు వాళ్లు నిర్మించిన ఆ అడ్డుగోడ ఆధారంగానే నేటికీ ఆయకట్టు భూములకు సాగునీరు అందుతోంది. పోలంపల్లి మున్నేరు ప్రాజెక్టుకి ప్రతి సంవత్సరం జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో భారీగా వరద వస్తుంది. ఆదే నాలుగు నెలల్లోనే దాదాపు 10 టీఎంసీల నీరు కృష్ణా నది ద్వారా సముద్రంలో కలిసిపోతుంది. వృథాగా పోతున్న నీటిలో కనీసం ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసుకునేలా 2004లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొదట్లో సుమారు ఐదు కోట్లతో పనులు మొదలుపెట్టారు. డ్యామ్ నిర్మించే ప్రదేశం తెలంగాణ సరిహద్దులో ఉండటంతో రాకపోకలకు వీలుగా బ్యారేజీ కట్టాలని అంచనాలు పెంచారు. నాలుగేళ్ల పాటు పనులు చేశారు. కాంక్రీట్ డ్యామ్, బ్యారేజీ నిర్మాణం, దానికి అనుసంధానంగా మట్టికట్ట నిర్మాణం రూ. 35 కోట్ల వ్యయంతో చేపట్టి గేట్లు అమర్చకుండా వదిలేశారు. ప్రస్తుతం ఆ ఇనుప సామాగ్రీ మొత్తం తుప్పు పట్టి నిరుపయోగంగా మారే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి.. మధ్యలోనే ఆగిపోయాయిన పనులను వెంటనే పూర్తి చేసి, రైతులు పెట్టుకున్న ఆశలను నేరవేర్చాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.