Minister Peddireddy Ramachandra Reddy: నిర్దేశించిన లక్ష్యం కంటే అదనంగా 2022-23 ఆర్ధిక సంవత్సరంలో మైనింగ్ రెవెన్యూ సాధించినట్టు గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మార్చి 31తో ముగిసిన కాలానికి గానూ 4692 కోట్ల రూపాయల మైనింగ్ రెవెన్యూ ఆర్జించినట్టు తెలిపారు. ప్రధాన ఖనిజాల్లో 81 శాతం మేర, అల్ప ఖనిజాల ద్వారా 125 శాతం మేర రెవెన్యూ ఆర్జించినట్టు మంత్రి తెలిపారు. గనుల శాఖ పై మంత్రి సమీక్ష నిర్వహించారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో 2వేల మైనింగ్ ప్రాంతాల్లో ఇ-ఆక్షన్ వేయాలని నిర్ణయించినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4222 లీజులు ఉంటే 3142 చోట్ల మైనింగ్ జరుగుతున్నట్టు తెలిపారు. మరో 1080 లీజుల్లో మైనింగ్ కోసం గనులశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సీనరేజి అవుట్ సోర్సింగ్ ద్వారా 1801 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు మంత్రి వెల్లడించారు. వచ్చే ఏడాదిలో 2137 కోట్లను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు మంత్రి ప్రకటించారు.
మరోవైపు కేంద్రప్రభుత్వ రంగ సంస్థలకు ధీటుగా ఏపీఎండీసీ మధ్యప్రదేశ్ లోని సుల్యారీలో 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి విక్రయించినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. తద్వారా 483 కోట్లు ఆదాయం ఆర్జించామన్నారు. మంగంపేట బెరైటీస్ నుంచి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తితో 1201 కోట్లు ఆర్జించామన్నారు. త్వరలోనే జార్ఖండ్ లోని బ్రహ్మదియా బొగ్గు గని నుంచి కూడా కోకింగ్ కోల్ ఉత్పత్తి చేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
'మార్చి 31తో ముగిసిన కాలానికి గానూ 4692 కోట్ల రూపాయల మైనింగ్ రెవెన్యూ ఆర్జించింది. ప్రధాన ఖనిజాల్లో 81 శాతం మేర, అల్ప ఖనిజాలద్వారా 125 శాతం మేర రెవెన్యూ ఆర్జించాం. 2వేల మైనింగ్ ప్రాంతాల్లో ఇ-ఆక్షన్ వేయాలని నిర్ణయించాం. రాష్ట్రవ్యాప్తంగా 4222 లీజులు ఉంటే 3142 చోట్ల మైనింగ్ జరుగుతుంది. 1080 లీజుల్లో మైనింగ్ కోసం గనులశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీనరేజి అవుట్ సోర్సింగ్ ద్వారా 1801 కోట్ల రూపాయల ఆదాయం సమకురింది. వచ్చే ఏడాదిలో 2137 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.'- గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కంటైనర్ 33కేవి విద్యుత్ సబ్ స్టేషన్: ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో రాష్ట్రంలో మొట్ట మొదటి సారీ ప్రయోగాత్మకంగా నిర్మించిన కంటైనర్ 33కేవి విద్యుత్ సబ్ స్టేషన్ను విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రప్రథమంగా గొల్లపూడి లో సుమారు 4కోట్ల 35లక్షల వ్యయంతో 3నెలల అతి తక్కువ సమయంలోనే కంటైనర్ సబ్ స్టేషన్ నిర్మాణం జరిగిందని మంత్రి తెలిపారు. భవిష్యత్ లో స్ధలా భావమున్న ప్రాంతాల్లో కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. త్వరలో అన్నవరంలో నిర్మిస్తున్న కంటైనర్ సబ్ స్టేషన్ కూడా పూర్తికానుందని వెల్లడించారు.
ఇవీ చదవండి: