Payyavula Keshav: జగన్ నాలుగేళ్లలో విద్యుత్ వినియోగదారులపై 50 వేల కోట్ల రూపాయల భారాలు మోపారని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్.. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. తద్వారా 16 వేల కోట్ల రూపాయల భారాన్ని జనంపై మోపారని మండిపడ్డారు. జగన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.31,261 కోట్లు అప్పులు చేశారని పయ్యావుల ఆక్షేపించారు. హిందుజాకు చెల్లించేందుకు సీఎం మరో 1,234 కోట్ల రూపాయలు అప్పుకు సిద్దమయ్యారని పయ్యావుల కేశవ్ దుయ్యబట్టారు. 2019-22 మధ్య బహిరంగ మార్కెట్ లో రూ. 12,200 కోట్లకు విద్యుత్ కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. డిస్కంల సరాసరి రేటు కంటే 4.75 అదనంగా పెట్టి కొన్నారని పయ్యావుల ఆరోపించారు. తద్వారా జగన్ రాష్ట్రానికి రూ. 6వేల కోట్ల రూపాయలు నష్టం కల్గించారని కేశవ్ విమర్శించారు.
నాలుగేళ్లలో రూ. 31,981 కోట్ల అప్పులు: జగన్ అధికారంలోకి వచ్చే 2019 నాటికి... రూ. 18,022 కోట్లు ఉన్న డిస్కంల అప్పులు.. ప్రస్తుంతం రూ. 50 వేల కోట్ల రూపాయలకు చేర్చారని పయ్యావుల కేశవ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో డిస్కంల అప్పు కేవలం రూ. 4,188 కోట్లు మాత్రమే పెరిగినట్లు వెల్లడిచారు. అదే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో రూ. 31,981 కోట్లు పెరిగాయని పయ్యావుల విమర్శించారు. ఒక్క యూనిట్ అదనపు విద్యుత్ ఉత్పత్తి చేయలేదన్నారు. అస్మదీయులకు లబ్దిచేకూర్చడానికే జగన్ అప్పులు చేస్తున్నారని విమర్శించారు. కేవలం ఈ మూడుళ్లల్లో షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌కు రూ. 2,629 కోట్లు విలువైన బిల్లులు చెల్లించారని పయ్యావుల కేశవు వెల్లడించారు.
కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి :
మాజీ మంత్రి కొడాలి నాని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ నెల్లూరు నగర ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి విమర్శించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాజకీయ భిక్షపెట్టిన చంద్రబాబును నోటికి వచ్చినట్లు తిట్టడం మంచిపద్దతికాదన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతున్న భాష గతంలో ఏ నాయకులు మాట్లాడలేదని శ్రీనివాసులరెడ్డి ఎద్దేవా చేశారు.
ఇవీ చదంవడి:
జీవితాలతో ఆడుకుంటూ.. ఇసుక దందా చేస్తున్నారు : నారా లోకేశ్
కారు చెప్పిన కిడ్నాప్ కథ..! చంపొద్దు, ఏదైనా చేయండి..! డీల్ వ్యవహారంలో ఊహించని మలుపు
శ్రీశైలం దేవస్థానానికి 4వేల 700 ఎకరాల అటవీ భూమి: మంత్రి కొట్టు సత్యనారాయణ