Pawan Kalyan Comments on Universities: విశ్వ విద్యాలయాలు విద్యార్థులను సామాజిక, రాజకీయ, ప్రాపంచిక విషయాలపై చైతన్యవంతులను చేయాలని జనసేనపార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు ఆ బాధ్యతను విస్మరించి అధికార పార్టీ కార్యకర్తలను తయారుచేసే పనిలో ఉన్నాయా అనే సందేహం కలుగుతోందన్నారు. విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చేశారన్నారు. తొమ్మిది దశాబ్దాలకు పైబడిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏ మేరకు ఆమోదయోగ్యమైనవని ప్రశ్నించారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలోనూ ఇదే పోకడ కనిపిస్తోందని విమర్శించారు.
విశ్వ విద్యాలయ ఉప కులపతులకు ఆ పార్టీ పట్ల ప్రత్యేక ప్రేమ, ముఖ్యమంత్రిపై అనురాగం ఉంటే వాటిని ఇంటికి పరిమితం చేసుకుని బాధ్యతలు నిర్వర్తించాలని కోరారు. విశ్వ విద్యాలయాల ఖాతాల్లోని నిధులను ప్రభుత్వం మళ్లించుకోవడాన్ని నిలువరించి, విశ్వ విద్యాలయ అభివృద్ధి కోసం ఉప కులపతులు బాధ్యతగా పని చేయాలని పవన్‌కల్యాణ్ సూచించారు.
-
విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దు
— JanaSena Party (@JanaSenaParty) December 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
• ఫ్లెక్సీలతో యూనివర్సిటీని నింపేయడం ఏం సూచిస్తోంది? - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/pvuJ7xLRA9
">విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దు
— JanaSena Party (@JanaSenaParty) December 22, 2022
• ఫ్లెక్సీలతో యూనివర్సిటీని నింపేయడం ఏం సూచిస్తోంది? - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/pvuJ7xLRA9విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దు
— JanaSena Party (@JanaSenaParty) December 22, 2022
• ఫ్లెక్సీలతో యూనివర్సిటీని నింపేయడం ఏం సూచిస్తోంది? - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/pvuJ7xLRA9
ఇవీ చదవండి: