ETV Bharat / state

పవిత్ర సంగమం.. నిర్వహణ లోపంతో.. నిరుపయోగంగా - ap news

Pavitra Sangamam Maintenance: పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందితే ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉపయోగపడతాయి. వాటి నిర్వాహణ గాలికి వదిలేస్తే..నిరుపయోగంగా మారిపోతాయి. విజయవాడ శివారులోని కృష్ణా, గోదావరి పవిత్ర సంగమ ప్రాంతం అభివృద్ధికి నోచుకోక కళ తప్పింది. ఫలితంగా పర్యాటకుల సందడి తగ్గిపోయింది.

Pavitra Sangamam
పవిత్ర సంగమం
author img

By

Published : Jan 6, 2023, 9:34 AM IST

Pavitra Sangamam Maintenance: విజయవాడకు కూతవేటు దూరంలోని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా, గోదావరి నదులు కలిసే సంగమాన్ని పవిత్రంగా భావిస్తారు. గత ప్రభుత్వం పవిత్ర సంగమం వద్ద పర్యాటకంగా అభివృద్ధి చేసింది. పవిత్ర సంగమం నుంచే దుర్గమ్మకు.. హారతులు అందజేసేవారు. నిత్యం జరిగే హారతిని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పవిత్ర సంగమం వద్ద హారతి కార్యక్రమాన్ని ఆపేయడంతో.. ఇక్కడకు వచ్చే పర్యాటకుల తాకిడి తగ్గింది. నిర్వాహణ లేక పవిత్ర సంగమం కళ తప్పింది. నదిలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన మెట్లు బురదమయంగా మారాయి. అతిథి గృహాలు నిరుపయోగంగా మారిపోయాయి. పవిత్ర సంగమ ప్రాంతం నేడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు.

పవిత్ర సంగమం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని..హారతి సౌకర్యం కల్పించాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.

"గతంలో ఇక్కడ చాలా బాగుండేది. అప్పట్లో పర్యాటకులు కూడా ఎక్కువగా వచ్చేవారు. గత కొంత కాలంగా ఎవరూ రావడం లేదు. దీనిని ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుంది". - రాహుల్, పర్యాటకుడు

"గత ప్రభుత్వంలో ఇక్కడ బాగుండేది. హారతులు ఇచ్చేవారు. ప్రస్తుతం కళావిహీనంగా అయిపోయింది. దీనిని పర్యాటక శాఖ వారు అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది. పర్యాటకం అభివృద్ధి చెందుతుంది". - చిరంజీవి, పర్యాటకుడు

ఈ ప్రదేశాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి.. దీనిని అభివృద్ధి చేయాలి. మంచికి కానీ.. చెడుకు కానీ.. చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. దీనిని పర్యాటకంగా అభివృద్ధి చేసి .. వసతులు కల్పించాలని కోరుతున్నాను". - వెంకటేశ్వరరావు, స్థానికుడు

"2016లో దీనిని మంచిగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఎక్కడా లైటింగ్ లేదు. అంతా చీకటిగా ఉంటుంది. సంగమం దగ్గర హారతి ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా లేదు. దయచేసి ప్రభుత్వం వారు హారతి పెట్టాల్సిందిగా నేను కోరుతున్నాను". - రవిచంద్ర, స్థానికుడు

"ఈ పవిత్ర సంగమం నీళ్లు తలపై జల్లుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోగా.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా.. దీనిని గుర్తించి పార్కులా తీర్చిదిద్దాలి". - మధుసూదన రావు, పర్యాటకుడు

నిర్వాహణ లోపంతో నిరుపయోగంగా పవిత్ర సంగమం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.