ETV Bharat / state

PM Modi: ఏపీ పరిణామాలపై ప్రధాని మోదీ స్పందించాలి: పత్తిపాటి పుల్లారావు

author img

By

Published : Oct 29, 2022, 4:49 PM IST

three capitals: ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలని తెదేపా నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కోరారు. మోదీ చేతులమీదుగు ప్రారంభించిన రాజధాని అమరావతి సమస్యను ఆయనే పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే విభజన రాజకీయాలతో నష్టపోయిన ఏపీకీ వైకాపా మరో మారు నష్టపోయేలా చేస్తున్నారని పత్తిపాటి మండిపడ్డారు.

పత్తిపాటి పుల్లారావు
పత్తిపాటి పుల్లారావు

Pattipati Pulla Rao: ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలని మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు కోరారు. ఏపీ అంశంపై ప్రధాని మౌనంగా ఉండడంతో చాలా మంది బాధపడుతున్నారని ఆయన తెలిపారు. స్వయంగా ప్రధాని చేతులతో శంకుస్థాపన జరిగిన అమరావతి ఆగిపోయిందని, ఈ విషయమై ప్రధాని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మూడు రాజధానుల రాజకీయానికి ప్రధానే చెక్ చెప్పాలని అంతా భావిస్తున్నారని పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే అమరావతి సమస్య క్షణాల్లో పరిష్కారం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీలో పరిణామాలను భాజపా రాష్ట్ర శాఖ.. దిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమైందన్నారు. మూడున్నరేళ్ల కాలంలో జరిగిన పరిణామాల్లో భాజపా పాత్రపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. విభజన రాజకీయంతో నష్టపోయిన ఏపీని, వైకాపా మళ్లీ విభజన రాజకీయం చేస్తూ నష్టపోయేలా చేస్తుందని పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.