ETV Bharat / state

No Sagar Water to NTR District: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు.. కళ్లముందే ఎండిపోతున్న దుస్థితి.. - నీళ్లు లేక పంటలు ఎండుపోతున్నాయి

No Sagar Water to NTR District: రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. కళ్లముందే పంటలు ఎండుతున్నా దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. వానలు కురవక.. సాగర్​ నీరు విడుదల కాక అన్నదాతలు అందోళనకు లోనవుతున్నారు. ప్రభుత్వానికి భవిష్యత్​ ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No_Sagar_Water_to_NTR_District
No_Sagar_Water_to_NTR_District
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2023, 9:29 AM IST

No Sagar Water to NTR District: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు.. కళ్లముందే ఎండిపోతున్న దుస్థితి..

No Sagar Water to NTR District: వాన జాడ లేదు.. ఆదుకుంటాయనుకున్న సాగర్ జలాలు విడుదల కావడం లేదు. కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే ఏమి చేయాలో తోచని నిస్సహాయ స్థితిలో ఎన్టీఆర్ జిల్లా రైతులు అల్లాడుతున్నారు. పంటలపై ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు.. ఈ విపత్కర పరిస్థితుల్లో నీటికోసం సతమతమవుతున్నారు. ఆఖరి ప్రయత్నంగా ఎక్కడో దూరాన ఉన్న బోర్లకు కిలోమీటర్ల దూరం మేర పైపులు వేసి సాగునీరు తెచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో నాగార్జున సాగర్ కింద 4.8 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది సాగర్ నుంచి సాగునీరు విడుదల చేయకపోవడంతో పంటలన్నీ ఎండుతున్నాయి. మిర్చి పంట దారుణంగా దెబ్బతినగా.. పత్తి పంట దిగుబడులపై ప్రభావం చూపే అవకాశముంది. రైతులు జులై, ఆగస్టులో కురిసిన వర్షాలతో చాలావరకు పంటలను కాపాడుకున్నారు.

Crops Dying Due to No Irrigation Water : అయ్యో అన్నదాత..! పొట్ట దశలో ఎండుతున్న పొలాలు.. కంట తడి పెడుతున్న రైతులు

Water Crisis: సెప్టెంబరు నుంచి సాగునీటికి కొరత ఏర్పడింది. మిర్చి పంట ఎండిపోగా సస్యరక్షణకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. కొన్నిచోట్ల మొక్క పూర్తిగా ఎండిపోవడంతో రైతులు ఆశలు వదులుకున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో 25వేల ఎకరాల్లో మిర్చి సాగుచేశారు. నెల నుంచి తీవ్ర వర్షాభావానికి తోడు నాగార్జున సాగర్ జలాశయం నుంచి చుక్కనీరు రాక కాల్వలు ఎండిపోయాయి.

ఈ వారంలో ఎంతో కొంత తడిపెడితే తప్ప మిర్చిపంట బతికే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. ఒక్కొక్క రైతు మిర్చి పంటపై ఎకరాకు లక్ష నుంచి లక్షా50వేల వరకు ఖర్చు చేశారు. తీరా పంట దుస్థితి చూసి చలించిపోతున్నారు. పత్తిపంటకు వర్షాభావాన్ని తట్టుకునే శక్తి ఉన్నప్పటికీ.. పూత, పిందె దశలో నీరు అవసరమని చెబుతున్నారు. సాగర్ నుంచి నీటి విడుదలకు ప్రభుత్వం శ్రద్ధ చూపాలని రైతులు వేడుకుంటున్నారు.

Farmers Associations Demand Vedadri Lift Scheme : 'వేదాద్రి ఎత్తిపోతల'కు మరమ్మతులు చేసి సాగు నీరందించాలి.. రైతు సంఘాల డిమాండ్

"పంటల పరిస్థితి అస్సలు బాలేదు. చాలా అధ్వానంగా తయారైంది. ప్రభుత్వం పట్టించుకునే విధానమే లేదు. కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. మాకు బోర్లు లేవు. ఇప్పటికి ఎకరానికి 50వేల రూపాయల పెట్టుబడి ఖర్చయ్యింది. నీళ్లు రాకపోతే ఆత్మహత్యలు చేసుకోవటం తప్ప మరో మార్గం లేదు." -రైతు

"వేదాద్రి ఎత్తిపోతల పథకం చంద్రబాబు ప్రారంభించారు. భూమి పూజ పూర్తి చేసుకుని మెటీరియల్​ కూడా వచ్చింది. కానీ రివర్స్​ టెండరింగ్​ వల్ల దాన్ని రద్దు చేశారు. ఒకవేళ అదే పథకం ఉండి ఉంటే ఇలా ఉండేది కాదు." -రైతు

Farmers Facing Irrigation Water Problems: ఎండిపోతున్న పంటలను చూసి ఆందోళన చెందుతున్న రైతులు.. ప్రత్యామ్నాయ చర్యల వైపు దృష్టి సారించారు. వ్యయ, ప్రయాసలకోర్చి కిలోమీటర్ల మేరకు పైపులు వేసి పంటకు సాగునీరు తెచ్చుకుంటున్నారు. పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు.

Farmers Suffering Due to Lack of Irrigation Water: వరిపైరుకు అందని సాగునీరు.. అల్లాడుతున్న రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.