ETV Bharat / state

Nara Lokesh Yuvagalam Padayatra In Old Krishna Dist: కిక్కిరిసిన బెజవాడ సర్కిళ్లు.. దమ్ము చూపెట్టిన యువగళం పాదయాత్ర..

Nara Lokesh Yuvagalam Padayatra In Old Krishna Dist: నారా లోకేశ్​ యువగళం పాదయాత్రకు విజయవాడ తూర్పు నియోజకవర్గం కదం తొక్కింది. పెనమలూరులో ప్రజాభిమానం పోటెత్తితే..గన్నవరం గజమాలలతో ఘన స్వాగతం పలికింది. తెల్లవారుజాము వరకూ పాదయాత్ర సాగినా.. ఏ ఒక్కరిలోనూ అలసత్వం కనిపించలేదు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలిరావడంతో యాత్ర మాస్‌ జాతరను తలపించింది.

Nara_Lokesh_Yuvagalam_Padayatra_In_Old_Krishna_Dist

author img

By

Published : Aug 21, 2023, 9:17 AM IST

Nara Lokesh Yuvagalam Padayatra In Old Krishna Dist: కిక్కిరిసిన బెజవాడ సర్కిళ్లు.. దమ్ము చూపెట్టిన యువగళం పాదయాత్ర..

Nara Lokesh Yuvagalam Padayatra In Old Krishna Dist: యువగళం పాదయాత్రతో బెజవాడ ప్రధాన కూడళ్లు అభిమానులతో కిక్కిరిశాయి. లోకేశ్​కు సంఘీభావం తెలిపేందుకు జనం భారీగా తరలివచ్చారు. విజయవాడ ఏ కన్వెన్షన్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. కూతవేటు దూరంలో ఉన్న పటమట చేరుకునేందుకు నాలుగు గంటల పైనే పట్టింది. గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌ ల నుంచి మహిళలు ఓపెన్‌ టాప్‌ వాహనాలు ఎక్కి.. జెండాలు ఊపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Nara Lokesh Padayatra at Vijayawada Autonagar: "రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై టీడీపీకి కచ్చితమైన విధానముంది"

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండో రోజు విజయవాడలోని తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. ప్రజలు భారీగా పోటెత్తడంతో పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలోకి చేరుకునేందుకు అర్ధరాత్రి సమయం పట్టింది. యాత్ర కొనసాగినంత వరకు దారిపొడవునా జనప్రవాహం కదం తొక్కింది. బాణ సంచాలు, భారీ గజమాలలతో అభిమానులు, పార్టీ శ్రేణులు లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు. వారికి అభివాదం చేస్తూ, వారి నుంచి వినతులు స్వీకరిస్తూ లోకేశ్‌ ముందుకు కదిలారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ముస్లింలు లోకేశ్​ యాత్రకు సంఘీభావం ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం 5,400 కోట్ల మైనార్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్లించిందని వివరించారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్‌ రోడ్డులో నిరుద్యోగులు వినూత్న శైలిలో నిరసన చేశారు. జాబ్‌లు పోగొట్టి నిరుద్యోగులకు జగన్‌ ఉరి వేశారని లోకేశ్‌ వద్ద వాపోయారు.

Grand Welcome to Lokesh Yuvagalam: ఉత్సాహంగా లోకేశ్​ పాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం..

వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని వారికి లోకేశ్​ హామీ ఇచ్చారు. ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద మహిళలు లోకేశ్‌కి హారతులతో నీరాజనం పలికారు. నగరంలో బ్లేడ్‌ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌ ఆగడాలు ఎక్కువయ్యాయని.. మహిళల సమస్యల్ని పరిష్కరించాలని లోకేశ్‌కు వినతిపపత్రం అందజేశారు.

టీడీపీ ప్రభుత్వంలో మహిళల వంక చూడాలంటేనే భయపడే విధంగా నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని లోకేశ్‌ మహిళలకు భరోసా కల్పించారు. మహిళలపై నమోదు చేసిన తప్పుడు కేసులను అధికారంలోకి వచ్చిన వెంటనే ఎత్తివేస్తామని స్పష్టం చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పిస్తామని ఆరోగ్య బీమా సౌకర్యంతో పాటు సబ్సిడీ ధరలపై ఇళ్ల స్థలాలు అందజేస్తామని లోకేశ్​ హామీ ఇచ్చారు.

విజయవాడ నగరాన్ని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని నారా లోకేష్‌ మండిపడ్డారు. నగర అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో రహదారులు ఎటుచూసినా గుంతలమయంగా మారాయని ధ్వజమెత్తారు. కనీసం డ్రెైనేజీలో మురుగు తీసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. వీఎంసీ నిధులను జగన్‌ సర్కారు లాగేసుకుందని ఆరోపించారు.

Nara Lokesh Selfi Challenge to CM Jagan: "సీఎం జగన్​ ఏ విధ్వంసంతో పాలన ప్రారంభించారో.. అక్కడి నుంచే పతనం ప్రారంభం కాబోతుంది"

టీడీపీ హయాంలో నిధులు విడుదల చేస్తే.. వాటిని ఖర్చు చేయకుండా డ్రెన్ల అభివృద్ధిని వైసీపీ సర్కార్‌ గాలికొదిలేసిందని ఆక్షేపించారు. చంద్రబాబు విజన్‌తో సుందరీకీకరణకు ప్రణాళికలు రూపొందిస్తే.. జగన్‌ నామరూపాలు లేకుండా సమాధి చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి రాగానే విజయవాడని మేటి నగరంగా తీర్చిదిద్దుతామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. యాత్ర కొనసాగుతుండగానే బందర్‌ ప్రధాన రహదారిపై విద్యుత్తు దీపాలను ఆర్పేయడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ‌్యక్తం చేశారు. దీంతో కొంత దూరం వరకు చీకటిలోనే యాత్ర కొనసాగింది.

పెనమలూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్రకు యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల వద్దకు యాత్ర చేరుకోగానే పోలీసులు డీజేను ఆపించేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొంతసేపటి తరువాత టీడీపీ నాయకులు పరిస్థితిని చక్కదిద్దడంతో డీజే కొనసాగిస్తూ యాత్ర ముందుకు కదిలింది.

Yuvagalam Padayatra Enters into Vijaywada: విజయవాడలోకి యువగళం పాదయాత్ర.. ప్రకాశం బ్యారేజీ పసుపుమయం

తెల్లవారుజామున 4గంటలకు కూడా రోడ్లపైకి పెద్దఎత్తున మహిళలు వచ్చి లోకేశ్​కు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో మచిలీపట్నం-హైదరాబాద్ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. లోకేశ్​ను చూసేందుకు ప్రజలు బ్రిడ్జిలు, భవనాలపైకి ఎక్కారు. లోకేశ్‌ వారిని ఆప్యాయంగా పలకలరిస్తూ ముందుకు సాగారు.

తాడిగడప, పోరంకి పరిసరాల్లో జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా లోకేశ్​ పాదయాత్రను కొనసాగించారు. అర్ధరాత్రి దాటాక యువగళం పాదయాత్ర నిడమానూరు వద్ద గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. స్థానికులు, యువత గజమాలలతో లోకేశ్​ని నియోజకవర్గంలోకి ఆహ్వానించారు.

నేడు గన్నవరం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర దాదాపు 16 కిలోమీటర్ల మేర సాగనుంది. నిడమానూరు క్యాంప్‌ సైట్‌ లో బీసీలు, చేతివృత్తిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అక్కడి నుంచి పాదయాత్ర గూడవల్లి, కేసరపల్లి, గన్నవరం విమానాశ్రయం, గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్‌ మీదుగా చిన్నఅవుటపల్లి ఎస్​ఎమ్​ కన్వెన్సన్‌ వరకూ సాగనుంది.

Nara Lokesh Reveals Love Story with Brahmani: బ్రాహ్మణితో నాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.