ETV Bharat / state

అగ్రిగోల్డ్ బాధితుల‌కు ఇస్తానన్న సొమ్ములు ఏవి ? - సీఎం జగన్​కు నారా లోకేశ్ లేఖ - Agrigold victims

Nara Lokesh Letter to CM Jagan: అగ్రిగోల్డ్ బాధితుల‌కు న్యాయం చేయాలని సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితుల‌కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో గతంలో తమపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశారని నారా లోకేశ్ పేర్కొన్నారు. జగన్‌, ఆయన అనుచర గణం అగ్రిగోల్డ్ ఆస్తులపై కన్నేసిందని ఆరోపించారు.

Nara Lokesh letter to CM Jagan:
Nara Lokesh letter to CM Jagan:
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2023, 5:35 PM IST

Nara Lokesh Letter to CM Jagan: త‌క్షణ‌మే అగ్రిగోల్డ్ బాధితుల‌కు సొమ్ములు చెల్లించి న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో అగ్రిగోల్డ్ బాధితుల‌కు ఇస్తామ‌న్న సొమ్ములు ఏవని ఆయన నిలదీశారు. మాన‌వ‌త్వంతో పనిచేసే ప్రభుత్వం అని ప్రచారం చేసుకున్న మీ పాల‌న‌లో చ‌నిపోయిన 600 మంది అగ్రిగోల్డ్ బాధితుల్లో ఏ ఒక్కరి కుటుంబానికైనా ఇస్తామ‌న్న 10 ల‌క్షల ప‌రిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు. క‌నీసం ప‌రామ‌ర్శ చేశారా, ఇదేనా మీ మాన‌వ‌త్వం అని మండిపడ్డారు.

30వేల కోట్లు ఆస్తుల స్వాధీనం చేసుకుని 3వేల కోట్లు చెల్లించలేకపోతున్నారు ! ఈ చేతగానితనాన్ని ఏమనాలి - వామపక్షల నేతల ధ్వజం

వైఎస్ హ‌యాంలోనే అగ్రిగోల్డ్ స్కాం: జ‌గ‌న్ ప్రతిప‌క్షనేత‌గా ఉన్నప్పుడు, అగ్రిగోల్డ్ విష‌యంలో తెలుగుదేశం ప్రభుత్వంపైనా, తనపైనా చేసిన ఆరోప‌ణ‌లు, చిమ్మిన విషం తాము మ‌రిచిపోలేదని అన్నారు. నాటి సీఎం వైఎస్ పాల‌న‌లో పుట్టిన‌ అగ్రిగోల్డ్‌, ఆయ‌న హ‌యాంలోనే స్కాం చేసిందని నారా లోకేశ్ ఆరోపించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక‌ అగ్రిగోల్డ్ ఆస్తులు 21 వేల ఎక‌రాలు అటాచ్ చేసినట్లు లోకేశ్ తెలిపారు. అగ్రిగోల్డ్ యాజ‌మాన్యాన్ని అరెస్టు చేయించి, బాధితుల‌కు న్యాయం చేసిందని గుర్తుచేశారు. అయినా తమపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశారని నారా లోకేశ్ దుయ్యబట్టారు. ప్రతిప‌క్షనేత‌గా హామీలిచ్చి గ‌ద్దెనెక్కాక వైఎస్సార్సీపీ చేసిన మోసంతో రోడ్డున‌ప‌డిన అగ్రిగోల్డ్ బాధితులు యువ‌గ‌ళం పాద‌యాత్రలో తనను క‌లిసి గోడు వెళ్లబోసుకున్నారని తెలిపారు.

Samara Shankaravam with Agri Gold Victims: 15న అగ్రిగోల్డ్‌ బాధితులతో.. విజయవాడలో సమర శంఖారావం: ముప్పాళ్ల నాగేశ్వరరావు

ఒక్క సెంటు ఆస్తి అయినా అటాచ్ చేయ‌లేదు: అప్పట్లో టీడీపీ ప్రభుత్వం డిపాజిట‌ర్లకి ఇవ్వడానికి సిద్ధం చేసిన 250 కోట్లు పంపిణీ చేయ‌కుండా అడ్డుకున్నారని లోకేశ్ ఆరోపించారు. తీరా అదే సొమ్ములో 14 కోట్లు త‌గ్గించి, 22 వారాల త‌రువాత 236 కోట్లే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో బాధితులు మ‌రింత బాధ‌ప‌డ్డారని లోకేశ్ అన్నారు. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తాను అగ్రిగోల్డ్ భూములు కొట్టేశాన‌ని బ‌రితెగించి రాయించారని లోకేశ్ విమర్శించారు. జగన్‌ సీఎం అయి ఐదేళ్లయినా అగ్రిగోల్డ్ కి చెందిన ఒక్క సెంటు ఆస్తి అయినా అటాచ్ చేయ‌లేదు ఎందుకని నిలదీశారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై జగన్‌, ఆయన అనుచర గణం కన్నేసి దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. ఈ విషయమై అగ్రిగోల్డ్ బాధితులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ఇంకా మిగిలిన 10 లక్షలకు పైగా అగ్రిగోల్డ్ డిపాజిటర్లు ఉన్నారని లోకేశ్ తెలిపారు. సీఎం జగన్‌ గద్దె దిగేలోగానైనా వారికి రావాల్సిన రూ. 3080 కోట్లను చెల్లించి న్యాయం చేయాల‌ని నారా లోకేశ్ డిమాండ్‌ చేశారు.

Agrigold: "వారంలోగా న్యాయం చేస్తామన్న జగన్​... ఇప్పటికీ పట్టించుకోవడంలేదు"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.