Nara Lokesh comments on Krishna Tribunal: జగన్ చేసిన పాపాలు రాయలసీమకి శాపాలుగా మారుతున్నాయని, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ సర్కారు దారుణ వైఫల్యం వల్లే కృష్ణాజలాల కేటాయింపులు పునఃసమీక్ష జరుగుతోందన్నారు. జగన్ కి ఇచ్చిన ఒక్క చాన్స్‌తో ఏమేమి కోల్పోయారో ప్రజలు గుర్తించాలన్నారు. రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలు తీర్చే కృష్ణా జలాలలో న్యాయబద్ధమైన వాటా కోల్పోతే, రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేసిన నేరాలు, రాష్ట్ర ప్రయోజనాలకి ఉరివేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాస్తుల కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదా వదులుకున్నాడని మండిపడ్డారు. రుషికొండ గుండు కొట్టిన కేసు తప్పించుకునేందుకు విశాఖ రైల్వేజోన్ కి నీళ్లొదిలాడని నారా లోకేశ్ దుయ్యబట్టారు. బాబాయ్ ని చంపించేసిన కేసులో తమ్ముడిని రక్షించుకునేందుకు ఏకంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుని ప్రశ్నార్థకం చేశాడని విమర్శించారు. రాయలసీమ బిడ్డనంటూ క్యాన్సర్ గడ్డలా పీడిస్తున్నాడని ఎద్దేవా చేశారు.
మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి: కృష్ణా జలాల నీటి వినియోగంపై కేంద్రం కొత్తవాదన తీసుకురావడానికి కారణం ముమ్మాటికీ జగన్ రెడ్డి అసమర్థతేనని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా మిగులు జలాల వినియోగానికి సంబంధించి కేంద్రప్రభుత్వ తాజా నిర్ణయంపై జగన్ రెడ్డి నోరువిప్పాలని డిమాండ్ చేశారు. నేడు ఢిల్లీ వెళ్తున్న జగన్ రెడ్డి, కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో ఏపీకి ముఖ్యంగా రాయలసీమకు జరిగే నష్టాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియచేయాలని సూచించారు. తన ఆస్తులు.. భూముల్ని కాకుండా రాష్ట్ర ప్రజానీకం, ఏపీ రైతాంగం.. భూముల్ని దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డి ఆలోచించాలని కోరారు. స్వ ప్రయోజనాలు పక్కనపెట్టి, ముఖ్యమంత్రిగా స్పందించి, ఏపీకి న్యాయం చేయాలన్నారు. తక్షణమే అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయించి, తాజా ప్రతిపాదనను జగన్ రెడ్డి తిరస్కరించాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపించి ఏపీ రైతాంగానికి న్యాయం చేయాలని తెలిపారు. లేకుంటే తెలుగుజాతి ఎన్నటికీ ఈ ముఖ్యమంత్రిని క్షమించదని హెచ్చరించారు.
CM Jagan Delhi Tour ఒక్కొక్కరుగా హస్తినకు.. సీఎం దిల్లీ పర్యటనలో ఏం జరిగేనో..!
బొజ్జా దశరథరామిరెడ్డి: రెండు తెలుగు రాష్టాల నీటి వినియోగంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు అదనపు అధికారాలు కల్పిస్తూ... కేంద్ర కాబినెట్ తీసుకున్న నిర్ణయంపై .. సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఏపీ నీటి హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఒత్తిడికి లొంగిందని తెలిపారు. అందుకోసమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు నూతనంగా... అదనపు విది విధానాలను దాఖలు పరిచిందని తెలిపారు. ఈ చర్యల వల్ల ఏపీ నీటి హక్కులకు, ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ నీటి హక్కులు కొల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.