Minister Botsa Satyanarayana Comments: విశాఖకు వెళ్లే అంశంపై ప్రభుత్వం అధికారికంగా జీవో ఇస్తే ఇక దొడ్డిదారి ఏమిటని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖతో పాటు కడపలోనూ సీఎంకు క్యాంప్ ఆఫీస్ ఉందన్నారు. ఉగాదికి సెలబ్రిటీ పార్టీ, టీడీపీ ఉండవనే తాను వ్యాఖ్యానించానని, ఎన్నికల తరువాత తాము రిపీట్ అయితే వాళ్లు ఎగ్జిట్ అవుతారన్నారు. బాధలు చెప్పుకునేందుకు నారా లోకేశ్ హోం మంత్రి అమిత్ షాను కలిసి ఉంటారని ఎద్దేవా బొత్స చేశారు. సీఎంపై చాడీలు చెప్పడానికే కలిశారన్నారు. ఎవరితో కలిసి వెళ్లారు అన్న అంశం తమ పార్టీ అవసరం లేదని స్పష్టం చేశారు. దేశానికి హోం మంత్రి గా అమిత్ షాను ఎవరైనా కలవొచ్చన్నారు. బీజేపీకి ప్రతీ అంశమూ చెప్పి చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.
CM Camp Office At Visakha: విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతిపై కమిటీ
కొన్ని రాజకీయ పార్టీలు అంశాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మాట్లాడే అంశాలు ప్రజలకు ఎంత ఉపయోగం అన్న విషయాన్ని బేరీజు వేసుకోవాలని హితవు పలికారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యత విద్య. ఎన్ఈపీ అమలు కావొచ్చు, ఇతర అంశాలు ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు ఉంటాయని బొత్స స్పష్టం చేశారు. బైజుస్‌తో చేసుకున్న ఒప్పందంలో ఎక్కడా ఆర్థికపరమైన అంశాలు లేవని బొత్స వెల్లడించారు. బైజూస్ సంస్థ ఉచితంగానే కంటెంట్ ఇస్తోందని తెలిపారు. 5.18 లక్షల ట్యాబ్‌లు 8 తరగతి విద్యార్దులకు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ ఏడాది మూడేళ్లకు సంబధించిన కంటెంట్‌ను ట్యాబ్‌ల్లో పెట్టి ఇస్తామని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో గందరగోళం సృష్టించవద్దనీ రాజకీయ పార్టీలను బొత్స కోరారు.
బడుల్లో బైజూస్ పాఠాలు.. ఏటా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు
టోఫెల్ కు ఉన్న ప్రాముఖ్యత ఏమిటో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసన్నారు. సెలబ్రిటీ పార్టీగా ఉన్న ఓ రాజకీయ పార్టీ చేస్తున్న ఆరోపణలు సరికాదని బొత్స సత్యానారాయణ తెలిపారు. ప్రైమరీ స్థాయిలో 6.30 లక్షల మందికి, జూనియర్ స్థాయిలో 14 లక్షల మందికి పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒక్కో పరీక్షకు ఒక్కొక్కరికి 7 రూపాయల చొప్పున చెల్లించాలని ఒప్పందం కుదిరిందన్నారు. ఆఖరున జరిగే పరీక్షకు 600 రూపాయలు ఉంటుంది. సాలీనా 80 వేల మందికి ఈ తుది పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. 20 లక్షల మంది విద్యార్థులకు ఏటా 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. మాట్లాడే పరీక్షకు 2500 రూపాయల వ్యయం అవుతుందన్నారు. 2027 వరకూ అయ్యే ఖర్చు 145 కోట్లు అని బొత్స తెలిపారు. అప్పటి వరకూ తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంచాలని ప్రయత్నం చేస్తే అడ్డుపుల్ల వేస్తున్నారని విమర్శించారు. పాఠశాలలలో బిగిస్తున్న ఐఎఫ్‌పీ ప్యానల్ ఒక్కొక్కటి బేరమాడి 1.25 లక్షల చొప్పున కొన్నామన్నారు. కొందరు నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బొత్స సత్యానారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు.
విశాఖకు వెళ్లే అంశంపై ప్రభుత్వం అధికారికంగా జీవో ఇస్తే ఇక దొడ్డిదారి ఏమిటి. విశాఖతో పాటు కడపలోనూ సీఎంకు క్యాంప్ ఆఫీస్ ఉంది. ఉగాదికి సెలబ్రిటీ పార్టీ, టీడీపీ ఉండవనే తాను వ్యాఖ్యానించానని, ఎన్నికల తరువాత తాము రిపీట్ అయితే వాళ్లు ఎగ్జిట్ అవుతారు. -బొత్స సత్యనారాయణ, మంత్రి