Like Share Subscribe Movie: మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్' నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా చిత్రం విజయం సాధించాలని కోరుతూ విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, సంతోష్ శోభన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. జాతిరత్నాలు ద్వారా తెలుగు ప్రేక్షకుల పరిచయమైన ఫరియా ఈ చిత్రంలో మరింత అలరించనుందని చెప్పారు. నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని అభిమానులు ఆదరించాలని.. ఈ సినిమాలో మంచి సరదా సన్నివేశాలు ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం ప్రవీణ్ లక్కరాజు, ఛాయగ్రహణం వసంత్. నిర్మాత వెంకట్ బోయినపల్లి.
ఇవీ చదవండి: