Lecturer Beaten Student In Vijayawada: విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్ విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టిన వీడియో దృశ్యాలు హల్చల్ చేస్తున్నాయి. ఓ కాలేజిలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై.. తరగతి గదిలోనే అధ్యాపకుడు చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో కాలుతో విద్యార్థిని తన్నాడు. ఈ ఘటనను వెనుక వైపు కూర్చున్న విద్యార్థులు సెల్ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాలు ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఘటనపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఎస్ఏఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: