ETV Bharat / state

Kidney Diseases: కిడ్నీ సమస్యలతో బతుకు పోరాటం చేస్తున్న ఏ. కొండూరు మండల వాసులు.. - Government assistance to kidney patients

Kidney Disease Problems: 35 సంవత్సరాలకే కిడ్నీ సమస్యలు.. 45 ఏళ్లకే మరణాలతో ఎన్టీఆర్ జిల్లాలోని ఏ. కొండూరు మండల వాసులు వణికిపోతున్నారు. ఔషధాలు కొనుగోలు చేసే స్థోమత లేక, డయాలసిస్ సేవలు అందుబాటులో లేక ప్రాణాల కోసం పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ హామీలు ప్రచారానికే పరిమితమవుతున్నాయని, తమ కష్టాలు మాత్రం తీరడం లేదని కిడ్నీ రోగులు కన్నీరు పెట్టుకుంటున్నారు.

Kidney Patients
కిడ్నీ సమస్యలు
author img

By

Published : Jun 13, 2023, 8:10 AM IST

అనుక్షణం నరకం అనుభవిస్తున్న ఏ. కొండూరు మండల కిడ్నీవ్యాధిగ్రస్తులు

Kidney Disease Patients problems : ఎన్టీఆర్ జిల్లా ఏ. కొండూరు మండలం 15 తండాల్లోని కిడ్నీవ్యాధిగ్రస్తులు అనుక్షణం నరకం అనుభవిస్తున్నారు. చీమలపాడు పెదతండాకు చెందిన సోమిలి అనే వృద్ధురాలు వయస్సు 65 ఏళ్లు. ఈమె కుమారుడు రాంబాబు 10 నెలల కిందట కిడ్నీ జబ్బుతో మృతి చెందాడు. వాలంటీర్ ఉద్యోగం, ఎకరం భూమి, డయాలసిస్‌ కాలానికి పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి నేతలు చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు సోమిలి కూడా అదే రోగం బారిన పడ్డారు. ఇదే తండాకు చెందిన 42 ఏళ్ల పిచ్చయ్య కూడా కిడ్నీవ్యాధితో పోరాటం చేస్తున్నారు. భర్త వైద్యం, ఇద్దరు పిల్లల పోషణ కోసం పిచ్చయ్య భార్య కూలి పనులకు వెళ్లాల్సి వస్తోంది.

"నాకు కూడా కిడ్నీల సమస్య వచ్చింది. నన్ను చూసుకునే వాళ్లు లేరు. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్లు కూలీ పనులు చేసుకుని జీవీస్తారు. నా కుమారుడు ఇటివలే కిడ్నీల సమస్యతో మరణించాడు. ప్రభుత్వం ఎకరం భూమి ఇచ్చి ఆదుకుంటానని చెప్పింది. భూమి ఇవ్వలేదు." -సోమిలి, కిడ్నీవ్యాధి బాధితురాలు

"నా భర్త ఐదు సంవత్సరాల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడ్తున్నాడు. తిని తినకుండా మందులు తీసుకువచ్చుకుంటున్నాము. మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. మాకు పిల్లలు ఇద్దరున్నారు. వాళ్లు చిన్నవాళ్లు. వాళ్లను పోషించుకోవటం, మందులు తీసుకోవటం ఇబ్బందిగా ఉంది. ఒక్కోసారి మందులకు డబ్బులు ఉండటం లేదు." -పిచ్చమ్మ, కిడ్నీవ్యాధి బాధితుడి భార్య

గ్రామాల్లో వైద్య శిబిరాలు పెట్టి నామమాత్రంగా రక్త నమూనాలు తీసుకుని ఫలితాలు చెబుతున్నారని, మందులకే నెలకు 5 వేల రూపాయలు ఖర్చవుతోందని బాధితులు వాపోతున్నారు. ఏ. కొండూరులో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినా.. పూర్తిస్థాయిలో వైద్య సేవలు ప్రారంభం కాలేదని రోగులు అంటున్నారు. ఇటీవల ఈ కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారని గుర్తు చేస్తున్నారు.

హాస్పిటల్ పూర్తయ్యి.. ఉద్దానం కిడ్నీ బాధితుల తలరాత మారేది ఎప్పుడో..?

"ఇప్పటి వరకు 600 మంది వరకు చనిపోయారు. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. తూతూ మంత్రంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి.. నామ మాత్రంగా పర్యటనలు ఏర్పాటు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. అంతే తప్పా పూర్తి స్థాయిలో రోగులను ప్రభుత్వం ఆదుకోవటంలో విఫలమవుతోంది." -గోపిరాజు, ఏపీ గిరిజన సంఘం అధ్యక్షుడు

మరోవైపు ఏ. కొండూరు మండలంలోని తండాల్లో 25 ఏళ్ల పైబడిన వాళ్లందరికీ రక్తపరీక్షలు చేశామని.. ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం 28 మంది మాత్రమే అధికారికంగా డయాలసిస్ చేయించుకుంటున్నారని.. ప్రతీ నెలా ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.