ETV Bharat / state

వైఎస్సార్సీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోంది - అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోంది: పవన్ - సీఎం జగన్​పై పవన్ ఫైర్

Janasena Chief Pawan Kalyan on Kapu Vote Bank: వైఎస్సార్సీపీ ఓటమి కళ్లెదుటే కనిపిస్తోందని అందుకే కాపు పెద్దలను రెచ్చగొడుతోందని జనసేన పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కుట్రలు, కుతంత్రాలతో అల్లిన వైఎస్సార్సీపీ వలలో చిక్కుకోవద్దని కాపు పెద్దలకు విజ్ఞప్తి చేశారు.

Janasena_Chief_Pawan_Kalyan_on_Kapu_Vote_Bank

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 1:19 PM IST

వైఎస్సార్సీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోంది - అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోంది: పవన్

Janasena Chief Pawan Kalyan on Kapu Vote Bank: వైఎస్సార్సీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోందని, అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను గౌరవించే కాపు పెద్దలు తనను దూషించినా దీవెనలుగానే స్వీకరిస్తానని చెప్పారు.

ఎమర్జెన్సీ సమయంలో అప్పటి పాలక పక్షాన్ని నిలువరించి దేశ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయని, అదే రీతిలో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ప్రకటించి తాను మొదలుపెట్టిన కార్యాచరణ వైఎస్సార్సీపీకీ, ఆ పార్టీని నడిపే నాయకుడికీ కంటగింపుగా మారిందని ధ్వజమెత్తారు.

అన్ని సామాజిక వర్గాల్లోనూ నిర్ధిష్టమైన శాతం, కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండగా ఉండటం వైఎస్సార్సీపీకి జీర్ణం కావడం లేదన్నారు. ఈ క్రమంలోనే కులపరమైన అస్త్రాన్ని వైఎస్సార్సీపీ ప్రయోగిస్తోందని మండిపడ్డారు. అందులో భాగంగా తాను గౌరవించే కాపు పెద్దలను రెచ్చగొట్టి దుష్ట ప్రయత్నాలకు ఒడిగడుతోందని మండిపడ్డారు.

Pawan on Volunteers : వాలంటీర్లతో ప్రజలకు.. జగన్​తో రాష్ట్రానికి ముప్పు: పవన్ కల్యాణ్

జనసేనపైనా, తనపైనా సామాజిక మాధ్యమాల్లో విషపు రాతలు రాయించడం, అపోహలు సృష్టించే తప్పుడు వార్తలను కేవలం కాపు సామాజిక వర్గం వారి మొబైల్ ఫోన్లకు మాత్రమే పంపడం లాంటి దుశ్చర్యలకు ఒడిగడుతోందని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చిన మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ ఆ తర్వాత ఎటు మళ్లిందో కాపు సామాజిక వర్గం గ్రహించిందని తెలిపారు.

కాపులకు రిజర్వేషన్ ఇచ్చేదే లేదని ప్రకటించిన జగన్‌ని కాపు పెద్దలు ప్రశ్నించాలన్నారు. కాపు కార్పొరేషన్‌కి నిధులు కేటాయింపు ఏమైందో నిలదీయాలని సూచించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్​లో కాపులకి ఇచ్చిన కోటాను తొలగించిన వ్యక్తిని ప్రశ్నించాలని హితవు పలికారు. కాపులను కాపు నాయకులతో తిట్టిస్తున్న వ్యక్తిని కాకుండా తనను దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనమో గ్రహించాలన్నారు. కుట్రలు, కుతంత్రాలతో అల్లిన వైఎస్సార్సీపీ వలలో చిక్కుకోవద్దని కాపు పెద్దలకు పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు.

"వైఎస్సార్సీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోంది. అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోంది. అన్ని సామాజిక వర్గాల్లోనూ నిర్ధిష్టమైన శాతం, కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండగా ఉండటం వైఎస్సార్సీపీకి జీర్ణం కావడం లేదు. ఈ క్రమంలోనే కులపరమైన అస్త్రాన్ని వైఎస్సార్సీపీ ప్రయోగిస్తోంది. అందులో భాగంగా నేను గౌరవించే కాపు పెద్దలను రెచ్చగొట్టి దుష్ట ప్రయత్నాలకు ఒడిగడుతోంది. నేను గౌరవించే కాపు పెద్దలు నన్ను దూషించినా నేను వాటిని దీవినలుగానే స్వీకరిస్తాను. దయచేసి కుట్రలు, కుతంత్రాలతో అల్లిన వైఎస్సార్సీపీ వలలో చిక్కుకోవద్దని కాపు పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను." - పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు

చంద్రబాబుతో పవన్​ భేటీ - తాజా రాజకీయ పరిణామాలపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.