ETV Bharat / state

జగన్ ను గద్దె దించేందుకు కలిసే నడుస్తామంటున్న.. ఆ పార్టీలు - వైసీపీ వార్తలు

Jai Bheem Bharat Party: వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రత్యక్ష పోరాటానికి జై భీం భారత్ పార్టీ, ఇండియన్ ముస్లీం యూనియన్ లీగ్ పార్టీలు సిద్దమవుతున్నట్లు ఆయా నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అచకాలను ప్రజలకు వివరించి వారిలో చైతన్యం నింపుతామని నేతలు వెల్లడించారు. సీఎం జగన్ ను గద్దెదించి, బలహీన వర్గాలు రాజ్యధికారం సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు.

Jai Bheem Bharat Party
Jai Bheem Bharat Party
author img

By

Published : Jan 21, 2023, 10:00 PM IST

Updated : Jan 21, 2023, 10:56 PM IST

Indian Muslim Union League Party: గత ఎన్నికల్లో అధికారమే లక్యంగా ముఖ్యమంత్రి జగన్ అబద్దపు హమీలను గుప్పించి తమను మోసం చేశారని దళిత, మైనార్టీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలన్ని ఒక తాటిపైకి వచ్చి రాజాధికామే లక్ష్యంగా అడుగులు వేయాలని వారు పిలుపునిస్తున్నారు. దళిత, మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ నేడు వారికి వెన్నుపొటు పొడుస్తుందని మండిపడ్డారు. విజయవాడలో జై భీమ్ భారత్ పార్టీ, ఇండియన్ ముస్లీం యూనియన్ లీగ్ పార్టీల నేతలు సమావేశమై.. ప్రభుత్వం దళిత, మైనార్టీలకు ఏ విధంగా అన్యాయం చేస్తుందో చర్చించారు. రానున్న ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఇరు పార్టీల నేతలు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాయి.

వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రత్యక్ష పోరాటానికి జై భీం భారత్ పార్టీ, ఇండియన్ ముస్లీం యూనియన్ లీగ్ పార్టీలు సిద్దమవుతున్నాయి. రాష్ట్రంలో దళితులు, ముస్లిం, మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిపై పెరుగుతున్న దాడుల గురించి చర్చించారు.తమ ఉద్యమ భవిష్యత్త్ కార్యాచరణను నేతలు కలిసి సిద్దం చేశారు. ముఖ్యమంత్రి జగన్ పాలన పగ్గాలు చేపట్టాగానే దళితులకు సంబంధించిన అనేక పథకాలను రద్దు చేశారని సదస్సులో పాల్గొన్న నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలే దళితులు, మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నారని జై భీమ్ పార్టీ అధ్యక్షులు జాడా శ్రావణ్‌ కుమార్ మండిపడ్డారు.

ఇప్పటి వరకు అధికారం అనేది అగ్ర వర్ణాలకు చుట్టంగా మారిందని, ఇప్పుడు బహుజనులు రాజ్యంధికారం దిశగా వెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. సంఖ్యాపరంగా కూడా దళితులు, బీసీల జనాభా ఎక్కువే ఉన్న మనలో మనకే ఐక్యత లేని కారణంగా అధికారం అందని ద్రాక్షగా మారిందని అవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనుకబడిన వర్గాలకు ఏం మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో దాదాపు 9 తీర్మాలను ఆమోదించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏ విధంగా దళితులు, మైనార్టీలను మోసం చేసిందో ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజాపా నేతలు ఏం చేపితే వైసీపీ ప్రభుత్వం దానిని అమలు చేస్తుందని ఇండియన్ ముస్లిం యూనియన్ లీగ్ పార్టీ నేతలు విమర్శించారు. భాజాపా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి జగన్ అంటకాగుతున్నారని మండిపడ్డారు. భాజాపా, వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని, వారికి మద్దతు ఇస్తే భవిష్యత్తు తరాలు కూడా మనల్ని క్షమించరనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. భాజాపా పాలిత రాష్ట్రంలో ఆర్.ఎస్.ఎస్ భావజాలంతో పాలన సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ముస్లింలకు ఇస్తున్న దుల్హన్, విదేశీ విద్యకు సహకారం, ఇమామ్​లకు వేతనాలు వంటి వాటిని తొలగించడం సిగ్గు చేటన్నారు. రంజాన్ తోఫాను కూడా రద్దు చేశారని ఇంతకంటే దారుణం మరోకటి ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ముస్లింలను నమ్మించి గొంత కోశారని మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వం నుంచి ముస్లింలకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. వైసీపీ పాలనపై తాము ప్రజల్లోకి వెళ్లతామని ఇరు పార్టీల నేతలు చెపుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న అచకాలను ప్రజలకు వివరించి వారిలో చైతన్యం నింపుతామని నేతలు అంటూన్నారు. సీఎం జగన్ ను గద్దెదించి, బలహీన వర్గాలు రాజ్యధికారం సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు.

Jai Bheem Bharat Party

ఇవీ చదవండి:

Last Updated : Jan 21, 2023, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.