ETV Bharat / state

Jagannana Suraksha for YCP Campaign: ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి.. జగనన్న ఆరోగ్య సురక్షతో పార్టీ ప్రచారం ముమ్మరం చేయండీ! - Jagananna Arogya Suraksha Program 45 days

Jagannana Suraksha for YCP Campaign: జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పార్టీ ప్రచారానికి తెర తీసింది. ఇంటింటి సర్వే ద్వారా అనారోగ్యంతో బాధ పడేవారిని గుర్తించి, వారికి వైద్యశిబిరాల ద్వారా చికిత్స అందించే కార్యక్రమం.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. 45 రోజుల పాటు జరిగే ఈ వైద్య శిబిరాలనే.. పార్టీ ప్రచారంగా రాష్ట్ర ప్రభుత్వం మార్చేసింది. వైద్య శిబిరాలకు రోగులను తీసుకొచ్చే బాధ్యతను వాలంటీర్లకు అప్పజెప్పగా జగన్‌కే ప్రాధాన్యమిచ్చేలా కరపత్రాల డిజైనింగ్, ముద్రణలో "ఐప్యాక్‌" కీలక పాత్ర పోషించింది.

Jagannana_Suraksha_for_YCP_Campaign
Jagannana_Suraksha_for_YCP_Campaign
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 1, 2023, 1:57 PM IST

Jagannana Suraksha for YCP Campaign: ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి.. జగనన్న ఆరోగ్య సురక్షతో పార్టీ ప్రచారం ముమ్మరం చేయండీ!

Jagannana Suraksha for YCP Campaign : ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అధికార పార్టీ ప్రభుత్వ పథకాలనే అస్త్రాలుగా వాడుకునేందుకు రంగం సిద్ధం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం (Jagananna Arogya Suraksha Program) ముసుగులో అధికార పార్టీ ప్రచారం మొదలైంది. కొత్త పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 500 మండలాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

Jagananna Arogya Suraksha Program YSRCP Leaders Used For Party Campaigning : వాటికి రోగులను తీసుకొచ్చే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించగా అక్కడికి వచ్చే వారికి అందించే సంచులు, కరపత్రాలపై జగన్ ఫొటో ఉండేలా డిజైనింగ్, ముద్రణలో "ఐ ప్యాక్‌ (I-PAC)" కీలక పాత్ర పోషించింది. ఒక్కో సంచికి 18 రూపాయలు, ఫోల్డర్‌కు 7 రూపాయలు ఖర్చుపెడుతున్నారు. సంచి ముందువైపు జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో సీఎం జగన్‌ ఫొటోను ముద్రించారు. పార్టీ రంగులైన నీలం, తెలుపు, ఆకుపచ్చలతోనే సంచి తయారు చేశారు.

Party Campaign With Government Schemes : శిబిరాల నిర్వహణ కోసం ముందుగా ఆరోగ్య సిబ్బంది వాలంటీర్లతో కలిసి ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం రోగాలతో బాధపడేవారిని గుర్తించి శిబిరాలకు రావాలని ఇచ్చే టోకెన్‌లోనూ సీఎం జగన్‌ బొమ్మే ఉంది. ఆరోగ్యశ్రీ పథకం, విలేజ్ హెల్త్ క్లీనిక్, 108, ఫ్యామిలీ డాక్టర్‌కు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాన్ని సైతం వైసీపీ రంగులతోనే ముద్రించారు. శనివారం ప్రారంభించిన ఈ కార్యక్రమంలోనూ పలుచోట్ల పార్టీ కార్యక్రమంలా హంగామా చేశారు.

Jagananna Arogya Suraksha Program 45 రోజుల పాటు 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం: సీఎం జగన్
గత ప్రభుత్వ హయాంలో అమలైన 104 చంద్రన్న సంచార వైద్య పథకాన్ని కొన్ని మార్పులతో ఫ్యామిలీ డాక్టర్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. చంద్రబాబు, కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వాల హయాంలో ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఈ తరహా వైద్య శిబిరాలు జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక మైదాన ప్రాంతాల్లోనే అడపాదడపా వైద్యశిబిరాలు జరిగాయి. కొవిడ్‌ తర్వాత వీటిని పూర్తిగా ఆపేశారు.

ఇటువంటి సేవలనే ఇప్పుడు గ్రామాల్లో అమలు చేస్తున్నారు. గైనిక్, పీడియాట్రిక్, ఆర్థో వైద్యులే వచ్చే అవకాశం ఉంది. బాలింతలు, గర్భిణులు, శిశువుల ఆరోగ్య సంరక్షణకు ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ తరఫున ఓ వ్యవస్థ ఉంది. దీనికి అదనంగా ఈ శిబిరాలతో కనిపించే ప్రయోజనాలు అంతంత మాత్రంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి.

శిబిరాలకు హాజరయ్యే వైద్యులకు రోజుకు 500 రూపాయల వరకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పని చేసే ఆసుపత్రి నుంచి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఈ శిబిరాలకు ఈ 500 రూపాయలతోనే వైద్యులు వెళ్లాల్సి ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లి రెండు, మూడు రోజులు ఉండాల్సి వస్తే ఉచిత రవాణా, బస కల్పిస్తున్నారు. ప్రభుత్వ పరంగా స్పెషలిస్టు, సూపర్‌స్పెషలిస్టు వైద్యులు బోధనాసుపత్రులు, కొన్ని జిల్లా ఆసుపత్రుల్లోనే ఉన్నారు.

Ammavodi Scheme: ఇదేనా మీ బాధ్యతా?.. 'అమ్మఒడి' డబ్బులపై వైసీపీ సర్కార్​ సవాలక్ష ఆంక్షలు

Jagananna Arogya Suraksha Program 45 Days : వేల గ్రామాల్లో ఈ వైద్యశి బిరాలు 45 రోజులు నిర్వహించాలి. వైద్యులు గ్రామాలకు వెళ్తే, బోధనాసుపత్రులకు ఓపీ, ఐపీ సేవలు, శస్త్రచికిత్సల కోసం వచ్చే రోగులపై ప్రభావం పడుతుందని పలువురు సూపరింటెండెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ కేజీహెచ్‌లో పని చేసే మైక్రోబయాలజిస్ట్‌తో సహా స్పెషలిస్టు వైద్యులను పార్వతీపురం పంపుతున్నారు. ఇలాంటి చోట్ల వైద్యులు మూడు నుంచి ఏడు రోజుల వరకు అక్కడే ఉండిపోవాల్సి వస్తోంది

ఆరోగ్యశ్రీకి అనుబంధంగా ఉన్న కార్పొరేట్, పెద్ద ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులూ శిబిరాలకు రావాలని వైద్య ఆరోగ్యశాఖ ఒత్తిడి చేస్తోంది. 45 రోజుల పాటు వైద్యులను ఎలా పంపాలో అర్థం కావట్లేదని యాజమాన్యాలు తల పట్టుకుంటున్నాయి. వైద్యులు లేకుంటే రోగులు అవస్థలు పడతారని, ఆదాయమూ పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Irregularities in Jagananna Bhu Hakku- Bhu Raksha Scheme: తప్పుల తడకగా జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం రీసర్వే.. సర్వేలో ఏకంగా నాలుగు ఎకరాలు మాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.