ETV Bharat / state

High Court Hearing on CBN Angallu Case Bail Petition: అంగళ్లు కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు - Chandrababu Angallu Case Bail Petition

High Court Hearing on CBN Angallu Case Bail Petition: అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తైంది. బెయిల్‌ పిటిషన్‌పై ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును నేటికి రిజర్వ్‌ చేసింది.

CBN_Angallu_Case_Bail_Petition
CBN_Angallu_Case_Bail_Petition
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2023, 4:32 PM IST

Updated : Oct 13, 2023, 8:58 AM IST

High Court Hearing on CBN Angallu Case Bail Petition: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగళ్లు ఘటనకు సంబంధించి.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై గురువారం విచారణ పూర్తైంది. విచారణలో భాగంగా బెయిల్‌ పిటిషన్‌పై ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్‌ చేసింది. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై.. నేడు తీర్పును వెల్లడించనుంది.

అసలు ఏం జరిగిదంటే.. 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఆగస్టు 4వ తేదీన అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన అంగళ్లు మీదుగా వెళుతుండగా అధికార వైఎస్సార్సీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆ ఘటనపై కేసు నమోదు చేసిన కురబలకోట మండలం ముదివేడు పోలీసులు.. చంద్రబాబును ఏ-1గా చేర్చుతూ మొత్తం 179 మంది నేతలపై కేసులు నమోదు చేశారు. హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. దాంతో నేతలు హైకోర్టులను ఆశ్రయించగా.. విచారణ అనంతరం కొందరికి బెయిల్‌ లభించింది. తాజాగా మరికొంతమందికి బెయిల్‌ మంజూరైంది.

Chandrababu Bail Petition : అంగళ్లు ఘటన.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ఈనెల 20కి వాయిదా

CBN Anticipatory Bail Petition in High Court: ఈ నేపథ్యంలో అంగళ్లు ఘటనలో తనపై నమోదు అయిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ.. చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌లో దురుద్దేశ పూర్వకంగా ఈ కేసులో చంద్రబాబు ఇరికించారని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. చంద్రబాబుపైనే రాళ్లదాడి జరిగిందని, దాడిలో ఎన్‌ఎస్‌జీ గార్డులు ఆయన్ను రక్షించారన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులకు బెయిల్‌ మంజూరైందని గుర్తు చేసిన న్యాయవాది.. తాజగా మరికొందరికి ముందస్తు, మరికొందరికి సాధారణ బెయిల్‌ మంజూరు చేశారని న్యాయస్థానానికి వివరించారు.

Arguments of Chandrababu Lawyer: అనంతరం హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌పై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేసిందని.. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని తెలిపిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును కోరారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల కారణంగా దాడి జరిగిందని పోలీసు తరపు న్యాయవాది వాదించారు. ముందస్తు బెయిల్‌ ఇవ్వద్దని కోరారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. దీంతో హైకోర్టు దీనిపై ఏ విధమైన తీర్పు వెలువరించనుందో అనేది టీడీపీ శ్రేణులు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

AP High Court Key Questions on Ruling Party Leaders: పుంగనూరు, అంగళ్లు ఘటనపై అధికార పార్టీ నాయకులకు హైకోర్టు సూటి ప్రశ్నలు

Lokesh Anticipatory Bail Petition Arguments Complete: మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఊరట లభించింది. స్కిల్‌ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ.. లోకేశ్ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ కేసులో నారా లోకేశ్‌ను ఇప్పటివరకూ ముద్దాయిగా చేర్చలేదని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేసులో పేరులేనందున ఆయనను అరెస్ట్‌ చేయబోమని న్యాయమూర్తికి స్పష్టం చేశారు. ఒకవేళ భవిష్యత్తులో లోకేశ్‌ పేరును కేసులో చేర్చాల్సి వస్తే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తామన్నారు. 41ఏ నోటీసు నిబంధనల ప్రకారం అనుసరిస్తామన్నారు. ప్రస్తుతం అరెస్ట్‌ అంశం లేనందున ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

High Court Dismissed Chandrababu Bail Petitions: చంద్రబాబు దాఖలు చేసిన 3 ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు.. బెయిల్‌, కస్టడీ పిటిషన్లు కొట్టివేసిన ఏసీబీ కోర్టు

Last Updated : Oct 13, 2023, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.