High Court Comments on Chandrababu Anticipatory Bail Petition : ఉచిత ఇసుక విధానానికి సంబంధించి చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిబంధనలను పాటించకుండా ఉచిత ఇసుక విధానాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిందని ప్రభుత్వం ఆరోపిస్తోందన్న హైకోర్టు ఏ బిజినెస్ రూల్స్‌ను పాటించకుండా నిర్ణయం తీసుకుందో సీఐడీ కోర్టు ముందుంచిన ఆధారాల్లో లేదని తెలిపింది.
క్యాబినెట్ తీర్మానం, 2016 మార్చిలో జారీచేసిన మెమోను పరిశీలిస్తే లోతైన అధ్యయనం చేయకుండా పూర్వ పాలసీని మార్చి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారనేందుకు ప్రస్తుతానికి ప్రాథమిక ఆధారాలేవీ లేవంది. ఎంత పరిమాణంలో ఇసుకను తవ్వి తరలించొచ్చనే విషయాన్ని క్యాబినెట్ తీర్మానంలో పేర్కొనలేదని ప్రభుత్వం చెబుతోందన్న హైకోర్టు సొంత నిర్మాణ అవసరాలకు మించి ఇసుకను నిల్వ చేయడానికి వీల్లేదని తీర్మానంలో పేర్కొన్నట్లు స్పష్టమవుతోందని తెలిపింది.
ఉచిత ఇసుక కేసులో ముగిసిన వాదనలు - చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
Chandrababu Anticipatory Bail in Sand Scam Case : ఉచిత ఇసుక విధానం ముసుగులో కొందరు అనుచిత లబ్ధి పొందారని ప్రభుత్వం ఆరోపిస్తోందన్న హైకోర్టు ఈ వ్యవహారంపై దర్యాప్తు సంస్థ ఆధారాలను సేకరించాలంది. ప్రభుత్వ విధాన నిర్ణయాల అమలు బాధ్యత యంత్రాంగంపై ఉంటుందని ఇసుక అక్రమ తవ్వకాలను నియంత్రించడంలో యంత్రాంగం విఫలమైతే విధాన రూపకర్తలను బాధ్యుల్ని చేయలేమంది. 2016-2019 మధ్య రాష్ట్రప్రభుత్వం ఇసుక అక్రమ తవ్వకాలపై వెయ్యికి పైగా కేసులు నమోదుచేసి, 40 కోట్ల జరిమానాను రాబట్టినట్లు గుర్తు చేసింది. ఈ వివరాలను చూస్తే ఇసుక అక్రమ తవ్వకాలపై అప్పటి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని తేటతెల్లమవుతోందని హైకోర్టు వెల్లడించింది.
Sand Scam Case in AP : ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగేలా కుట్ర చేశారనే ఆరోపణలను నిరూపించేందుకు ప్రభుత్వం ప్రత్యక్ష, ఇతర సాక్ష్యాధారాలు సేకరించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. పర్యావరణానికి జరిగిన నష్టానికి 100 కోట్ల రూపాయల కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద డిపాజిట్ చేయాలని ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించిందని తెలిపింది. బాధ్యుల నుంచి ఆ సొమ్మును రాబట్టాలని పేర్కొంది.
చంద్రబాబుపై అప్పుడే చర్యలు వద్దు - ఏం చేయాలో మేము చెప్తాం: ఏపీ హైకోర్టు
ఎన్జీటీ ఉత్తర్వులను పరిశీలిస్తే ఉచిత ఇసుక విధానంలో అక్రమ తవ్వకాలు జరిగినట్లు కనిపించడం లేదన్న హైకోర్టు అక్రమ తవ్వకాలకు తావులేకుండా విధానాన్ని అమలుచేయాలని ఎన్జీటీ స్పష్టంచేసిందని తెలిపింది. ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయడంలో విఫలమవ్వడానికి ఉచిత ఇసుక విధానాన్ని కారణంగా చెప్పలేమంది. అమలులో చోటుచేసుకున్న లోటుపాట్లకు విధాన రూపకర్తలను బాధ్యులుగా చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఉచిత ఇసుక విధానం ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగతంగా ఆర్థిక ప్రయోజనం పొందారనేందుకు సీఐడీ ఎలాంటి ఆధారాలను కోర్టుకు చూపలేదని హైకోర్టు తెలిపింది. పిటిషనర్ నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించాలని సీఐడీ చెబుతోందన్నఉన్నత న్యాయస్థానం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని పిటిషనర్‌కు ముందస్తు బెయిలు మంజూరుచేస్తున్నట్లు తెలిపింది.
సీఐడీ కోర్టును తప్పుదోవ పట్టిస్తోంది- పేదల కోసమే ఉచిత ఇసుక విధానం