Governor Special Chief Secretary : గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి రామ్‌ప్రకాశ్ సిసోడియాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఆయన స్థానంలో అనిల్‌కుమార్ సింఘాల్‌ను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్‌ను.. ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ ఉద్యోగులతో కలిసి గవర్నర్‌ను కలవడానికి దోహదపడ్డారన్న కారణంతోనే సిసోడియాపై బదిలీవేటు పడినట్లు తెలుస్తోంది. పోస్టింగ్ కూడా ఇవ్వకపోవడానికి అదే కారణమని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఇవీ చదవండి :