Government is Preparing to Implement Guaranteed Pension Scheme in AP : ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా జీపీఎస్ విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ నెల 21 తేదీ నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లోనే ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ సిస్టం ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపకుండానే భాగస్వాములతో చర్చించి సుదీర్ఘ కసరత్తు చేసి జీపీఎస్ ముసాయిదాను రూపోందించినట్టు పేర్కోంది.
వాస్తవానికి 2023 జూన్ లో జరిగిన కేబినెట్ సమావేశంలోనే జీపీఎస్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక జీపీఎస్ బిల్లుకు శాసనసభ ఆమోదం ఒక్కటే అవసరమని ప్రభుత్వం పేర్కోంటోంది. కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను సమీక్షించాలని దీర్ఘకాలికంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారని.. అయితే పాత పెన్షన్‌ను అమలు చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలోనే ప్రభుత్వం జీపీఎస్ తీసుకువచ్చిందని స్పష్టం చేసింది.
CPS Employees Worried about Government Decisions on GPS : సుదీర్ఘమైన కసరత్తు, భాగస్వాములతో చర్చల అనంతరం జీపీఎస్‌ను ప్రతిపాదించినట్టు ప్రభుత్వం చెప్పుకొస్తోంది. ఇందు కోసమే ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ సిస్టమ్ ఆర్డినెన్స్ 2023 (AP Guaranteed Pension System Ordinance 2023) పేరిట ముసాయిదాను సిద్ధం చేసినట్టు స్పష్టం అవుతోంది. 2004 సెప్టెంబరు 1 తేదీ తర్వాత చేరిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీపీఎస్ వర్తింప చేస్తామని ప్రభుత్వం ఆ ముసాయిదాలో పేర్కోంది.
ఎన్పీఎస్లోని మార్గదర్శకాలకు అనుగుణంగానే పెన్షన్ కార్పస్, యాన్యుటీ వర్తింప చేస్తామని వెల్లడించింది. ఇక మొబైల్ టాప్ అప్ రీచార్జి తరహాలో జీపీఎస్ ఉద్యోగి విరమణ సమయానికి యాన్యుటి తగ్గి పెన్షన్ 50 శాతం కంటే తగ్గితే టాప్ అప్ అమౌంట్ ఇస్తామని ముసాయిదాలో పేర్కోంది. అటు స్పౌస్ పెన్షన్ 60 శాతం కంటే తగ్గినా టాప్ అప్ అమోంట్‌ను కలుపనున్నట్టు స్పష్టం చేసింది.
మరోవైపు జీపీఎస్ ప్రయోజనాలు పొందేందుకు ఉద్యోగి విరమణ కంటే ముందు కనీసం 10 ఏళ్ల సర్వీసు తప్పని సరిగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుంటే కనీసంగా 20 ఏళ్ల పాటు సర్వీసు అందించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. రాజీనామా, క్రమశిక్షణా చర్యలతో సర్వీసు నుంచి తొలగింపు లాంటి పరిస్థితుల్లో జీపీఎస్ ప్రయోజనాలు వర్తించవని స్పష్టం చేసింది.
ప్రస్తుతం కొత్త పెన్షన్ స్కీమ్‌లో ఉన్న ఉద్యోగులు జీపీఎస్ ఆప్షన్ ఎంచుకోవచ్చని ప్రభుత్వం ముసాయిదాలో పేర్కోంది. పెన్షన్ మొత్తంలో నుంచి మధ్యలో నగదు ఉపసంహరణ చేస్తే టాప్ అప్ కాంపోనెంట్పై ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ ఆర్ధిక సుస్థిరతను తీసుకు వస్తుందని ముసాయిదాలో ఏపీ ప్రభుత్వం పేర్కోంది.
Prepare GPS Proposed Ordinance as Alternative to CPS: జీపీఎస్‌లో పెన్షన్‌కు గ్యారంటీ లేనట్టేనా ?