ETV Bharat / state

ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎన్నో ఇబ్బందులు: తమిళనాడు మాజీ గవర్నర్ - తమిళనాడు మాజీ గవర్నర్ హాజరయ్యారు

Gandhi's death anniversary: ఎన్టీఆర్ జిల్లా మెగల్ రాజ్ పురంలోని సిద్దార్థ కళశాలలో ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో గాంధీజీ 75వ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు మాజీ గవర్నర్ పి. రామ్మోహనరావు తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Gandhi
గాంధీ
author img

By

Published : Jan 30, 2023, 5:20 PM IST

Gandhi's Death Anniversary: ప్రస్తుతం దేశంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎన్నో ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తమిళనాడు మాజీ గవర్నర్ పి. రామ్మోహనరావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మొఘల్​రాజ్ పురంలోని సిద్దార్థ కళశాలలో ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో గాంధీజీ 75వ వర్థంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ ఎక్కడికైనా వెళ్లాలంటే బ్రిటిష్ పాలకులు అప్పట్లో ప్రత్యేక రైలు నడిపేవారని చెప్పారు.

గ్రామ స్వరాజ్యం కావాలని గాంధీజీ కలలు కన్నారని.. దానికి అనుగుణంగానే అనేక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారని తెలిపారు. పారిశ్రామిక వర్గాలకు సామాజిక బాధ్యత ఉండాలని గాంధీకి అప్పుడే చెప్పారని అన్నారు. ఆదానీలను విమర్శించే వాళ్లను తాను సమర్ధించనని.. వాళ్లు స్థాపించిన పరిశ్రమల వల్ల లక్షలాది మంది జీవిస్తున్నారని పేర్కొన్నారు.

అదానీ, అంబానీ ఇతర పారిశ్రామికవేత్తలు తప్పు చేస్తే కచ్చితంగా శిక్షించాలన్నారు. నేడు డబ్బులు సంపాదించడానికి అనేక అడ్డదారులు తొక్కుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. సత్యం, అహింస అనేవి పదునైన ఆయుధాలని వాటి ద్వారా మనిషిలో ఉన్న అనేక రుగ్మతలను దూరం చేయొచ్చని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పి.ఎస్ నారాయణ తెలిపారు. మనం ఎదుట వారికి ఏం చెబుతున్నామో.. అది మనం తప్పకుండా పాటించాలన్నారు. గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.