GAD Orders on All Uploading state Go's: ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (హైకోర్ట్) వ్యాఖ్యల నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) హడావిడిగా వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల్లో..ఇక నుంచి ప్రభుత్వ ఉత్తర్వులను ఏపీ గెజిట్ వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. కొన్ని ప్రభుత్వ విభాగాలు క్రమానుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులను అప్‌లోడ్ చేయకపోవడంపై జీఏడీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. గతంలోనే ఏపీ గెజిట్ వెబ్‌సైట్‌లో జీవోలు అప్‌లోడ్ చేసేందుకు జీఏడీ ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించింది.
GAD Note on Govt GO'S: జీవోలు ఏపీ గెజిట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని.. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) గురువారం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని విభాగాలు జీవోలు అప్‌లోడ్ చేయకపోవడంపై జీఏడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకపై అన్ని జీవోలు అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. దాంతోపాటు జీవోఎంఎస్, జీవోఆర్టీలను నిరంతరం అప్‌లోడ్ చేయాలని జీఏడీ నోట్ విడుదల చేసింది. 2022 ఫిబ్రవరి 1 నుంచి నేటి వరకున్న జీవోలు అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. జీవోలు అప్‌లోడ్ చేసి, వాటి వివరాలు కేబినెట్ సెక్షన్ అధికారికి పంపాలని వివరించింది. జీవోలు అప్‌లోడ్ చేయకపోతే.. ఇన్‌ఛార్జులను బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. జీవోలు అప్‌లోడ్ చేయకపోవటాన్ని ఇటీవలే హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో హడావిడిగా వివిధ శాఖలకు జీఏడీ నోట్ విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వదిలేస్తే.. తహశీల్దార్లకూ సలహాదారులను నియమిస్తారేమో: హైకోర్టు
High Court Fire on YCP Govt: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. జీవోలను ఏపీ గెజిట్ వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయకుండా గోప్యంగా ఉంచడంపై పలువురు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్ట్)లో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవోలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు..?, అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరమేంటి..? అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది.
భార్యాపిల్లలు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోరా - పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
High Court Hearing on GO's Petitions: ప్రభుత్వ జీవోల గోప్యతపై హైకోర్ట్‌లో జరిగిన వాదనల ప్రకారం.. 2021లో వేసిన పిటిషన్‌పై ఇంకా విచారణ జరుగుతోందని పిటిషనర్ల తరుఫు న్యాయమూర్తి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.70 శాతం జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచటం లేదని న్యాయవాది ఉమేష్‌చంద్ర కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. జీవోలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు?, అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. జీవోల ద్వారా హక్కులు సంక్రమిస్తాయి.. ఆ హక్కులను మీరెలా కాలరాస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. దాంతో జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచటంపై తాను పూర్తి వివరాలు అందిస్తానని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. అనంతరం తదుపరి విచారణను వచ్చే బుధవారం చేపడతామని న్యాయస్థానం తెలిపింది.
కింద పడుకోవాల్సి వస్తే మన పిల్లల్ని హాస్టల్స్‌లో చేరుస్తామా- ప్రభుత్వంపై హాకోర్టు ఘాటు వ్యాఖ్యలు