ETV Bharat / state

విశాఖ వేదికగా జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు.. సుందరీకరణపై ప్రభుత్వం దృష్ణి

Review on G20 Summit: జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు విశాఖను తీర్చిదిద్దనున్నారు. మొత్తం 45 దేశాలకు చెందిన ప్రదినిధులు హాజరు కానున్నారని.. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి తెలిపారు. ఇతర దేశాలనుంచి వచ్చే ప్రతినిధుల సౌకర్యం కోసం అనువాదకులను నియమించనున్నారు. మార్చి 28, 29 తేదీల్లో సమావేశాలు జరుగనున్నాయి.

srilakshmi
శ్రీలక్ష్మి
author img

By

Published : Jan 7, 2023, 10:41 AM IST

Review on G20 Summit: విశాఖలో మార్చి నెలలో జరగనున్న జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాల కోసం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. మార్చి 28, 29 తేదీల్లో జరుగనున్న ఈ సమావేశాలకు 45 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారని ఆమె స్పష్టం చేశారు. ఇతర దేశాలనుంచి వచ్చే ప్రతినిధుల సౌకర్యం కోసం ఆయా భాషల అనువాదకులను నియమించాలని..అందులో తెలుగువారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే జీ -20 సదస్సుపై విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు సమాచార పౌర సంబంధాలశాఖ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

"ఇండియా.. జీ-20 సదస్సుకు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సమావేశాలు సెప్టెంబర్ 9,10 తేదీలలో దిల్లీలో జరగనున్నాయి. దాంట్లో భాగంగా మార్చి 28, 29 తేదీల్లో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు విశాఖలో జరగునున్నాయి". - శ్రీలక్ష్మి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాల గురించి వివరిస్తున్న పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.