Former CS Comments: కాపులకు బీసీ రిజర్వేషన్లపై తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాపులకు బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం వల్ల బీసీలకు కాపులు దూరమవుతున్నారని అన్నారు.కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడొద్దని ముద్రగడకు తాను చెప్పానని అన్నారు. బీసీ రిజర్వేషన్లనేది కాపుల సంక్షేమానికి కంటితుడుపు చర్యే తప్ప సామాజికంగా ఎటువంటి ప్రయోజనం లేదని తెలిపారు.
"రాజకీయంగా, వ్యాపారపరంగా కానీ మనం అభివృద్ధిలోకి రాకపోవడానికి కారణం పౌరుషం అనేది పెద్ద అడ్డకట్ట. అలా అని పౌరుషం లేకుండా బతకమని కాదు. నువ్వు గొప్పా..నేను గొప్పా అనే ఆలోచనలు రావడం వలన మనం అభివృద్ధిలోకి రాలేక పోతున్నాం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాపులకు బీసీ రిజర్వేషన్ ఇవ్వదు. అలా ఇచ్చినా సరే ఏం ఉపయోగం ఉండదు. రిజర్వేషన్ కాపులకు వద్దు. కేవలం రిజర్వేషన్ ద్వారానే రాజకీయ ప్రయోజనం రాదు. ఇరవై శాతం ఉన్న కొన్ని కులాలకు.. 20 శాతం రిజర్వేషన్ ఏప్పటి నుంచో ఉంది.. కానీ వాళ్ల నుంచి ఎవరూ సిఎం కాలేదు. సమష్టి నాయకత్వం ఉన్నప్పుడే.. రాజకీయంగా రాణించగలం". - రామ్మోహన్‌రావు, తమిళనాడు మాజీ సీఎస్
ఇవీ చదవండి: