ETV Bharat / state

Rains: అకాల వర్షాలు.. అన్నదాతకు కన్నీళ్లు

author img

By

Published : May 1, 2023, 7:40 PM IST

untimely rains: అకాల వర్షాలతో అన్నదాతలు కుదేలయ్యారు. ఆరుగాలం శ్రమించి పండించిన వరి తడిచి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్​బీకే అధికారులు ఈ-క్రాప్‌ చేసినా, పంట కొనట్లేదని ఆరోపిస్తున్నారు. తడిచిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. అప్పులు తెచ్చి పంటలు పండించామని, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. వడ్లు మొలకెత్తడంతో పంటను కొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని వాపోతున్నారు.

untimely rains
అన్నదాత
ఎన్టీఆర్ జిల్లాలో అకాల వర్షానికి తడిసి ముద్దయిన వరి ధాన్యం

Untimely rains in NTR district: అకాల వర్షాలు అన్నదాతల నోట మట్టికొడుతున్నాయి. తీవ్రమైన ఎండలతో పంట కోతలకూ ఉక్కిరిబిక్కిరి అయిన సాగుదారులకు.. ఊహించని వర్షాలు పులిమీద పుట్రలా మారాయి. రబీ ధాన్యం కొనుగోలులో అనిశ్చితి కొనసాగుతోంది. రైతుభరోసా కేంద్రాల నుంచి కర్షకులకు కాస్తంత ఊరట కూడా లభించడంలేదు. మిల్లర్లదే అంతిమ నిర్ణయమవుతోంది. వారు చెప్పిన ధరకే విక్రయించాల్సిన దుస్థితిలో ఉండడం తమను తీవ్రంగా కుంగదీస్తోంది. ఈ నేపథ్యంలో అకాల వర్షంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా మారింది.. రైతుల పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

అకాల వర్షాలతో చేతికొచ్చే దశలో పంటలు ఇలా చేజారిపోతుండడాన్ని సాగుదారులు తట్టుకోలేకపోతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గం, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గాల పరిధిలో ఆరబోసిన ధాన్యం కుండపోతగా వాన, ఈదురు గాలులకు తడిసిముద్దయ్యాయి. ధాన్యం కుప్పలు తడిసిపోకుండా ఉండేందుకు కప్పిన పట్టాలు సైతం గాలులకు ఎగిరిపోవడం వల్ల తడిసిపోయాయి. పట్టాల మీద భారీగా నీరు చేరిపోయింది. మధ్యాహ్నానికి వర్షం తెరిపివ్వడంతో కప్పిన పట్టాల నుంచి నీటిని బయటకు తోడేందుకు.. తడిసిన ధాన్యాన్ని కనీసం గాలికైనా ఆరబెట్టేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. ఏ రైతును కలిపినా తమ వద్ద ఉన్న ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియడం లేదని.. ప్రభుత్వం సూచించిన సన్న రకాలనే తాము సాగు చేసినా తమను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే రెండు, మూడు వందల రూపాయల తక్కువ ధరకు కొనుగోలు చేసేలా మిల్లర్లు మాట్లాడుతుండడం తమను కుంగదీస్తోందంటున్నారు. మిల్లర్లను నియంత్రించి.. ప్రభుత్వం నిర్దేశించిన ధరకు కొనుగోలు చేయాల్సిన పాలకులు, అధికారులు ఏం చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో ఖరీఫ్‌తో సమానంగా రబీలోనూ ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టరు ఆదేశించినా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు ప్రారంభం కాలేదు. బోర్లు, నాగార్జునసాగర్‌ కాల్వల కింద దాదాపు 85 వేల ఎకరాలకు మించే వరి సాగు అయింది. గత ఖరీఫ్‌లో 1.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా ఖరీఫ్‌ ధాన్యమే చాలా వరకు రైతుల వద్ద కొనుగోలు కోసం ఎదురు చూస్తుండగా.. ఆన్‌లైన్‌ ద్వారా కాకుండా నేరుగానే విక్రయించారంటూ వారికి ఇంకా నగదు జమ చేయని పరిస్థితి కొనసాగుతోంది. రబీ దిగుబడి ధాన్యానికి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అధికారులు చెబుతున్నా... రైతు భరోసా కేంద్రాల సిబ్బంది, క్షేత్రస్థాయి యంత్రాంగం మాత్రం మిల్లర్ల వైపే చూస్తోంది. మిల్లర్లు మద్దతు ధరను పరిగణనలోకి తీసుకోకుండా ధర కోతకున్న అవకాశాలన్నింటినీ వల్లెవేస్తూ అన్నదాతలకు ఉసూరుమనిపిస్తున్నారు. ఎప్పటి నుంచి తీసుకుంటారనే ప్రశ్నకు బదులివ్వడంలేదు. ఈలోగా వేసవిలో వచ్చిన వానలకు ధాన్యం తడవడంతో కన్నీరే మిగిలిందటున్నారు.

ఇప్పుడు తడిసిన ధాన్యానికి ఎన్నెన్ని వంకలు పెట్టి ఎంత ధర తగ్గించేస్తారోనని సాగుదారులు కలత చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయించాలని, లేనిపక్షంలో మళ్లీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ చేస్తోన్న హెచ్చరికలకు తమకు పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేలా లేవని కలవరపడుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.