ETV Bharat / state

'మిమ్మల్ని మీరు నమ్మితేనే నాయకురాలవుతారు!' - మహిళలకు సలహాలు

Expert advice for women to grow in life: కొంత మంది మహిళలకు ఎంతో నైపుణ్యం ఉన్నా బయటపెట్టడానికి ఆలోచిస్తారు. తాము ఏదైనా పోరపాటు చేస్తే మిగిలిన వారు ఏమి అనుకొంటారో అని సంకోచిస్తారు. దీనివలన వారిలో ప్రతిభ ఉన్నా జీవితంలో ఎదుగుదలకు ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వాటిని అధిగమించేందుకు కొంత మంది నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. అవి ఏమిటంటే..!

tips for women to grow in life
మహిళలకు సలహాలు
author img

By

Published : Jan 23, 2023, 3:55 PM IST

Expert advice for women to grow in life: కొందరు ఉద్యోగినులు... బాధ్యతల్ని ఎంత సక్రమంగా నిర్వర్తించినా సరే, నలుగురిలోనూ ప్రెజంటేషన్లు ఇవ్వాలన్నా, సెమినార్లూ, మీటింగ్‌లకు నాయకత్వం వహించాలన్నా.. వెనకడుగు వేస్తారు. దీనికి కారణం.. ప్రతిభ లేక కాదు... ఎవరైనా ఏమైనా అనుకుంటారనే భయమే! ఈ తీరు మీ ఎదుగుదలకు అడ్డంకి అవుతుంది అంటారు కెరియర్‌ నిపుణులు.

నమ్మండి: ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు ఇతరుల సంగతి పక్కనపెట్టి ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. అందరికీ అన్నీ తెలిసి ఉండాలని ఏమీ లేదు. కానీ, పనిపై పూర్తి అవగాహనతో చేస్తే.. తడబాటుకి అవకాశం ఉండదు. ఆందోళన దరిచేరదు.

సానుకూలంగా: గెలుపోటముల్ని సమానంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. పనిలో విమర్శను సానుకూలంగా తీసుకోవాలి. ఎవరైనా విమర్శిస్తున్నారంటేనే.. మీరు వాళ్లు గుర్తించదగ్గ ఏదో ఒకపని చేస్తున్నారనే అర్థం. అయినా, అసలు ప్రతికూలంగా ఆలోచించడం ఎందుకు? మీ ఆలోచన అద్భుతం అనికూడా అందరూ ప్రశంసించే అవకాశమూ ఉంది కదా! మరి అసలు వెళ్లకుంటే ఏమవుతుంది? నలుగురిలో ఒకరిలా ఉండి పోతారు. మీ ఆలోచనలు బావుండొచ్చూ, లేకపోవచ్చు.. కానీ అవి చెప్పకుంటే ‘అసలు ఈ అమ్మాయికి ఏ ఆలోచనా లేదు’ అనే ముద్రపడుతుంది. అదే అసలైన ప్రమాదం!

వేర్వేరుగా చూడండి: మీరూ, మీ కెరియర్‌ వేర్వేరు అనే విషయం గుర్తుంచుకోండి. చదువు లేదా ఉద్యోగంలో మీ విజయాలూ, ఓటముల్ని మీ వ్యక్తిత్వం నుంచి వేరుగా చూడండి. వీటిలో పాతాళానికి పడిపోయినా సరే దాని ప్రభావం మీ వ్యక్తిత్వంపై పడకుండా చూడండి. అప్పుడే ఎన్ని విమర్శలొచ్చినా వాటి మంచి చెడుల్ని తార్కికంగా ఆలోచించగలరు.

మనోధైర్యంతో ఉండాలి: ఏదైనా విషయంలో తాము చేయగలమనే మనోధైర్యం ఎంతో అవసరం. మనలో ప్రతిభ ఉన్నప్పుడు ఒక్క అడుగు ధైర్యంతో వేయాలి. విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని దానిపై సరైనా నిర్ణయం తీసుకోగల్గాలి. ప్రతి విషయంలో ధైర్యంగా ఉండడం వలన చాలా సమస్యలకు పరిష్కార మార్గాలు సులభంగా దొరుకుతాయి.

సమయస్ఫూర్తితో వ్యవహరించాలి: మహిళలకు సమాజంలో చాలా సమస్యలు ఎదురవుతాయి. వాటికి బయపడి పారిపోకుండా సమయస్ఫూర్తితో ఎదుర్కోగలగాలి. మహిళల్లో నాయకత్వం వహించాలనే ఆశ ఉంటే సరిపోదు. దానికి అనుగుణంగా సమయాన్ని వినియోగించుకోవాలి. సరైన సమయానికి తగిన విధంగా స్పదించడం వలన తమ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. దానితో పాటు సమాజంలో గౌరవం దక్కుతుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.