Dussehra 2023 Celebrations in AP : శ్రీదేవీ నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని (Dussehra Celebrations on Indrakiladri) ఉత్సవ కమిటీ చైర్మన్ గోకరాజు గంగరాజు, వైస్ చైర్మన్ చదలవాడ నాగేశ్వరరావు తెలిపారు. విజయవాడలో దసరా ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆయన ఆవిష్కరించారు.
Dussehra Navratri Arrangements on Vijayawada Indrakeeladri : అనంతరం చైర్మన్ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ.. విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా నవ రాత్రులు నిర్వహిస్తున్నామని తెలిపారు. దసరా అంటే రాష్ట్రంలోనే విజయవాడలోని ఇంద్రకీలాద్రి ప్రసిద్ధ గాంచిందని అన్నారు. నగరంలోని సిద్ధార్థ కళాశాలలో అమ్మవారి ఉత్సవాలను 15వ తేదీన ప్రారంభిస్తామని గోకరాజు గంగరాజు పేర్కొన్నారు.
దసరా ఉత్సవాలకు సిద్ధమైన ఇంద్రకీలాద్రి.. నేడు స్వర్ణ కవచాలంకృత రూపం
అమ్మవారి దీక్షపరులకు వేరుగాను మరియు సామాన్య ప్రజలకు అమ్మవారి దర్శనం నేరుగా కలిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అందరికీ అనుకూలంగా ఉండే విధంగా సిద్దార్ద కళాశాలలో ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, వేద పండితులు ఘనాపాటి, ఘన పద్యుల నడుమ ఈ కార్యక్రమం జరగనుందని ఆయన తెలిపారు. ఈ నెల 15 నుండి 24 వరకు దసరా మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపనున్నామని అన్నారు. నవరాత్రుల్లో అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనం ఇస్తారని, రాష్ట్రంలోని భక్తులను ఉత్సవాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోకరాజు గంగరాజు కోరారు.
మైసూర్ ప్యాలెస్లో నవరాత్రి ఉత్సవాలు.. ఎక్స్క్లూజివ్ ఫొటోస్
APSRTC to Run 5500 Special Buses for Dasara : రాష్ట్ర వ్యాప్తంగా దసరా పండుగ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా 5500 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ నెల 13 నుంచి 26 వరకు పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై రాష్టాలకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి 2050 బస్సులు, బెంగళూరు నుంచి 440, చెన్నై నుంచి 153 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
885 Buses for Vijayawada Kanakadurgamma Darshan : కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కోసం విజయవాడకు 885 బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీల వసూలు ఉండవని స్పష్టం చేశారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ల రిజర్వేషన్లు చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. రాను పోను ప్రయాణానికి ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపిన అధికారులు.. ఏటీబీ ఏజెంట్లు, ఏపీఎస్ఆర్టీసీ యాప్, ఆన్ లైన్ ద్వారా టికెట్లు పొందవచ్చని సూచించారు.