ETV Bharat / state

Disabled Person Pension Problem : కాళ్లు విరిగాయి దేవుడా అంటే.. 'కరెంటు బిల్లు' అంటున్నారు.. వైకల్యం అతడికా.. ఈ ప్రభుత్వానికా..!

Disabled Person Pension Problem: ఇల్లు తప్ప.. ఆస్తులేమీ లేని కుటుంబం. రోజు వారీ పనులకు వెళ్తే తప్ప పూటగడవని పరిస్థితి. విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. నిలబడ లేక.. నడవలేక.. వీల్ చైర్​కే పరిమితమై ఆస్పత్రి ఖర్చులకు ఉన్న ఇల్లు కూడా అమ్మేశాడు. అతడి బాధ కళ్లెదుటే కనిపిస్తున్నా అధికారులు కనికరించడం లేదు. అడ్డగోలు నిబంధనలతో ఆసరా దివ్యాంగుల పింఛన్ ఇవ్వడం లేదు.

Disabled_Person_Pension_Problem
Disabled_Person_Pension_Problem
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2023, 3:44 PM IST

Disabled Person Pension Problem: రోడ్డు ప్రమాద బాధితుడికి అందని పింఛను.. ఎడాదిగా ఆసరా కోసం ఎదురుచూపులు..

Disabled Person Pension Problem: విధి ఎప్పుడు ఎవరిని బాధిస్తుందో తెలియదు. పిల్లాపాపలతో చక్కగా సాగిపోతున్న అతడి కుటుంబాన్ని రహదారి ప్రమాదం ఛిన్నాభిన్నం చేసింది. రెండు కాళ్లు, పక్కటెముకలు విరిగి.. గూని జారిపోగా.. చికిత్స కోసం తిరగని ఆస్పత్రి లేదు.. చేయని ప్రార్థన లేదు. వైద్యం కోసం ఉన్న ఇల్లు అమ్మేశాడు. జీవనభృతి నిమిత్తం పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. ఏడాదిగా కాళ్లరిగేలా తిరుగుతున్నా.. ఈ అభాగ్యుడిని పట్టించుకునే నాథుడే లేడు. ఇంటి యజమాని నడవలేని స్థితిలో ఉండడంతో ఆ కుటుంబ పోషణ కష్టతరంగా మారింది.

PENSION PROBLEMS: వేళ్లే లేవంటే.. వేలిముద్రలు వేయట్లేదని ఏం చేశారంటే..!

వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ గ్రామీణ మండలం పైడూరిపాడుకు చెందిన ఈ బాధితుడి పేరు శ్రీరామకోటేశ్వరరావు. వెల్డింగ్ కూలి పనులు చేసుకుని బతికే అతడు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు, పక్కటెముకలు విరిగిపోవటంతో పాటు గూని జారిపోయింది. వైద్య చికిత్సలు నిమిత్తం విజయవాడ, హైదరాబాద్​లోని పలు ఆస్పత్రులకు అతడి కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లారు. నాలుగుసార్లు అతడికి వైద్యులు ఆపరేషన్లు కూడా చేశారు. ఇందుకోసం అతడి కుటుంబ సభ్యులు సుమారు పదిన్నర లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. డబ్బు కోసం ఇల్లును అమ్మేసుకున్నారు.

'సారూ నేను బతికే ఉన్నా.. పెన్షన్​ ఇవ్వండి'.. అధికారులకు 70 ఏళ్ల వృద్ధుడు రిక్వెస్ట్​.. కానీ!

Pension Problems in AP: ఎన్ని ఆపరేషన్లు చేసినప్పటికీ అతడి రెండు కాళ్లు మెరుగుపడలేదు. మందుల కోసం నెలకు సుమారు 5వేల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ప్రతి 15 రోజులకొకసారి ఆస్పత్రికి వెళ్లాల్సిందే. మరోవైపు కుటుంబ పోషణ భారంగా మారింది. గతేడాది సదరం శిబిరంలో 77 శాతం వికలాంగుడని ధ్రువీకరణ చేశారు. అప్పటి నుంచి అతడు వికలాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నాడు. ఏడాది నుంచి ఫించన్ కోసం తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు.

Disability Pension in AP: తొలుత కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తిరస్కరించారు. ఇప్పుడేమో రకరకాల కారణాలు చూపుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే.. కలెక్టరేట్‌లోని స్పందనలో ఫిర్యాదు చేయమన్నారని బాధితుడు తెలిపారు. ఇలా తిప్పుతూనే ఉన్నారు తప్ప పింఛన్‌ మాత్రం రావటంలేదని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పింఛన్‌ మంజూరు చేయాలని రామకోటేశ్వరరావు వేడుకుంటున్నాడు.

People Agitation for Pension: తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు.. పింఛన్​ బాధితుల ఆందోళన

"రోడ్డు ప్రమాదంలో నా రెండు కాళ్లు, పక్కటెముకలు విరిగిపోయాయి. నా కాళ్లలో ఎముకలు తీసేసి.. వైద్యులు తొమ్మిది రాడ్లు వేశారు. నేను పదిహేను రోజులకోసారి ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. మందుల కోసం నెలకు సుమారు 5వేల రూపాయలు ఖర్చు అవుతోంది. జీవనభృతి నిమిత్తం పింఛన్ కోసం ఏడాది నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. నన్ను పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పింఛన్‌ మంజూరు చేయాలని వేడుకుంటున్నాను." - శ్రీరామకోటేశ్వరరావు, పైడూరిపాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.