ETV Bharat / state

Devineni Uma Serious Allegations: కృష్ణా జలాలు తెలంగాణకు తాకట్టు.. ఎన్నికల కోసం రూ.1200కోట్లు తీసుకున్న సీఎం జగన్ : టీడీపీ

Devineni Uma Serious Allegations: జగన్ ప్రభుత్వ విధానాల వల్లే కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్​కు అన్యాయం జరుగుతోందని టీడీపీ నేతలు, దేవినేని ఉమ, కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ఎన్నికల కోసం తెలంగాణ నేతల నుంచి జగన్ రూ.1200 కోట్లు తీసుకున్నారని.. అందుకు ప్రతిఫలంగా... రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడని విమర్శించారు. అపెక్స్ కౌన్సిల్​లో సరైన వాధనలు వినిపించకపోవడం వలన నేడు కృష్ణా జలాల వినియోగంలో ఏపీ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

devineni_uma
devineni_uma
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2023, 4:02 PM IST

Devineni Uma Serious Allegations: సీఎం జగన్ ఎప్పటికీ రాయలసీమ ద్రోహిగా నిలిచిపోతార..:కాల్వ

Devineni Uma Serious Allegations: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నిరసనగా... ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఉమా మహేశ్వర్ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల వినియోగంపై పున సమీక్ష చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అసమర్థత కారణమని దేవినేని ఉమా ఆరోపించారు. కృష్ణా జలాల వినియోగంపై ఎపెక్స్ కౌన్సిల్లో సరైన వాదాలను వినిపించకపోవడం వల్లనే ఈరోజు ఏపీకి తీవ్ర అన్యాయం జరగబోతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో తెలంగాణ నాయకుల నుంచి 1200 కోట్ల రూపాయలు తీసుకొని ఎన్నికల్లో ఖర్చు చేశారని ఉమా ఆరోపించారు. దీనికిగాను ప్రతిఫలంగా రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని విమర్శించారు. అపెక్స్ కౌన్సిల్​లో సరైన వాధనలు వినిపించకపోవడం వలన నేడు కృష్ణా జలాలో ఏపీ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ సుప్రీంకోర్టులో రద్దు కాకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి 52 నెలలుగా ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అవినాష్ రెడ్డి ని కాపాడేందుకు కేంద్రానికి దాసోహం అయ్యారని తెలిపారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అయితే తాడేపల్లి కొంపలో ఇద్దరు పేర్లు బయటికి వస్తాయని సీఎం భయపడుతున్నారు అన్నారు. తెలంగాణతో పాటు ఏపీ కూడా ఎన్నికలకు జరిపించాలని కోరుతూ ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రిని కలవడానికి వెళ్లారన్నారు. తెలంగాణతో పాటు ఏపీ కూడా ఎన్నికలు కు వెళ్లాలని సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని కోర్టులో న్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబును బయటికి రాకుండా చేసేందుకు పీటి వారెంట్లోపై మళ్లీ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు.

CM Jagan Delhi Tour ఒక్కొక్కరుగా హస్తినకు.. సీఎం దిల్లీ పర్యటనలో ఏం జరిగేనో..!

కాల్వ శ్రీనివాసులు: సీఎం జగన్ తన స్వార్ధ ప్రయోజనాల కోసం... రాయలసీమ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని టీడీపీ మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. కృష్ణాజిల్లాల పునః పంపిణీ పై నిర్ణయం తీసుకునే విధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కేంద్రం అప్పజెప్పడంపై మాజీ మంత్రి కాల్వ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. పైనుంచి రావాల్సిన నీరు సక్రమంగా రావడం లేదన్నారు. తనపై ఉన్న కేసులను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం కాళ్లు పట్టుకోవడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు.

Water Users Associations on Krishna Tribunal: 'కృష్ణా జలాలపై కేంద్ర నిర్ణయంతో ఏపీకి అన్యాయం.. వెంటనే వెనక్కి తీసుకోవాలి'

తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో సగం వాటా అడగడం.. దానికి అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడారని నిలదీశారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక లేఖ ద్వారా రాష్ట్ర జలాల విషయంలో మరణశాసనం రాశారని ఆరోపించారు. ఇప్పుడు ఆయన కుమారుడు హయాంలో మరోసారి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. సీఎం జగన్ తన కేసుల కోసం రాజీపడి ఇలాంటి నిర్ణయాలు విషయంలో మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఇది శాపంగా మారుతుందన్నారు. మరోవైపు పక్క రాష్ట్రాల్లో తన ఆస్తులు, తన అనుచరుల ఆస్తులను కాపాడుకునేందుకు అన్నింటినీ ఒప్పుకోవడం సరైన చర్య కాదని కాల్వ శ్రీనివాసులు అన్నారు. సీఎం జగన్ ఎప్పటికీ రాయలసీమ ద్రోహిగా నిలిచిపోతారని కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు

Case Filed on TDP leaders for holding a rally in support of CBN చంద్రబాబుకు మద్దతుగా శాంతిర్యాలీలో పాల్గొన్నందుకు టీడీపీ నేతలపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.