Dalit Community Leaders Meeting on Kodi Kathi Srinu Case: సీఎం జగన్ ప్రతీసారి నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ దళితులకు వెన్నుపొటు పొడుస్తున్నారని దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. 2019 ఎన్నికల్లో అధికారం కోసం ఒక దళిత యువకుడిని బలి చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఎంత పెద్ద నేరస్తుడికైనా న్యాయస్థానం బెయిల్ ఇస్తుందని కానీ కొడికత్తి కేసులో మాత్రం జన్నుపల్లి శ్రీనుకు బెయిల్ రావడం లేదని వారు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. జన్నుపల్లి శ్రీను (కొడికత్తి శ్రీను)కు బెయిల్ మంజురు చేసి, విడుదల చేయాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులతో పాటు దళిత, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కోడి కత్తి దాడి కేసులో కుట్రకోణం లేదు - సరైన కారణం చూపకుండా జగన్ హైకోర్టును ఆశ్రయించారు : ఎన్ఐఏ
2018 నుంచి కోడికత్తి కేసులో జరుగుతున్న పరిణాలమాలు సీఎం జగన్ వ్యవహరిన్తున్న తీరుపై దళిత సంఘాల ప్రతినిధులు చర్చించారు. దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఉద్యమ భవిష్యత్ కార్యచరణను నేతలు సిద్దం చేశారు. 2018లో ఘటన జరిగితే ఇప్పటి వరకు జన్నుపల్లి శ్రీనుకి బెయిల్ రాలేదని మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు వాపోయారు. ఎన్ఐఏ కూడా ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదని చెప్పిందని గుర్తు చేశారు. ఆర్ధిక కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ ఆ కేసుల్లో విచారణకు వెళ్లడం లేదని అలాగే సాక్షిగా ఉన్న కేసుల్లో కూడా విచారణకు హాజరు కావడం లేదని విమర్శించారు. శ్రీనుకు బెయిల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలను ఎకతాటిపైకి తీసుకువచ్చి దశల వారి పోరాటానికి సిద్దం అవుతున్నామని చెప్పారు.
Dalit Communities Protest Details:
- శ్రీనుకి బెయిల్ ఇవ్వాలని కోరుతూ జనవరి 13వ తేదీ ఒంగోలులో సంఘీభావ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.
- జనవరి 18, 19వ తేదీల్లో సీఎం జగన్ దళిత ద్రోహి పేరుతో విజయవాడలోని ధర్నా చౌక్‌లో శ్రీను కుటుంబ సభ్యులతో కలిసి నిరసన దీక్ష చేపడుతామని వివరించారు.
- జనవరి 3 నుంచి 19 వరకు సమతా సైనిక దళ్ అధ్వర్యంలో నిర్వహించే 'రావాలి జగన్ - చెప్పాలి సాక్ష్యం'లో దళితులందరూ భాగస్వాములవుతామని వివరించారు.
- జనవరి 30న విజయవాడలో 'పోవాలి జగన్' పేరుతో అంబేద్కర్ వాదుల మహాసభ నిర్వహిస్తున్నామని, జగన్ అధికారంలోకి రావడానికి కోడికత్తి కేసు ఎలా ఉపయోగపడిందో జగన్‌ను అధికారం నుంచి దూరం చేయడానికి కూడా ఈ కేసు అలాగే ఉపయోగపడుతుందని అన్నారు.
Kodi Katti Sreenivas Mother ‘హంతకులు బయట తిరుగుతున్నారు.. నా కొడుకు జైల్లో మగ్గుతున్నాడు’
Kodi Kathi Srinu Mother Comments: జగన్ తనపై జరిగిన దాడి గురించి న్యాయస్థానానికి వచ్చి సాక్ష్యం చెప్పడానికి రాకపోవడంతో కోడికత్తి శ్రీను జైలులోనే మగ్గుతున్నాడని శ్రీను తల్లి సావిత్రి కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమారుడిని విడుదల చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను కొరినా వారు స్పందించట్లేదని చెబుతున్నారు. తన కుమారుడి కోసం ఏడవని రోజు లేదని నాలుగేళ్ల నుంచి నా కొడుక్కి బెయిల్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. కుమారుడు లేకపోవడంతో తమ బతుకులు దుర్భరంగా మారాయని చెప్పారు. న్యాయస్థానాలు స్పందించి కుమారుడి వద్దకు తనను చేర్చాలని ఆ తల్లి వేడుకుంటోంది.