ETV Bharat / state

చీకటి జీవోని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి : రామకృష్ణ - ap news

CPI State Secretary on GO Number 1: రాష్ట్ర ప్రభుత్వ తీసుకొచ్చిన జీవో నెంబర్ 1కు వ్యతిరేకంగా.. ప్రతిపక్షాలు జీవో ప్రతులను భోగిమంటల్లో వేసి దగ్ధం చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్వాగతించారు. జగన్ సర్కారు నిరంకుశ విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయని అన్నారు.

CPI state secretary Ramakrishna
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
author img

By

Published : Jan 14, 2023, 10:14 PM IST

CPI State Secretary on GO Number 1: రాష్ట్రంలో ర్యాలీలు, రోడ్ షోలు, సభలు, ప్రదర్శనలకు అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చీకటి జీవో నెంబర్ 1 విడుదల చేసిందని ,ఇది ప్రజాస్వామ్యాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. భోగి పండగ సందర్భంగా.. జీవో నెంబర్ 1 ప్రతులను రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో భోగిమంటల్లో వేసి దగ్ధం చేసిన ప్రతిపక్ష పార్టీలకు, ప్రజా సంఘాల వారికి సీపీఐ రాష్ట్ర సమితి తరపున అభినందనలు తెలిపారు. 75 సంవత్సరాల దేశ స్వాతంత్య్ర చరిత్రలో.. ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు అమలు జరగలేదని అన్నారు. కనీసం బ్రిటీష్ కాలంలో కూడా ఇంత నిరంకుశంగా జీవోలు తీసుకురాలేదని సాక్షాత్తు హైకోర్టు అభిప్రాయపడిందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు జగన్ సర్కార్ నిరంకుశ విధానంపై భగ్గుమంటున్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి జీవోను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.