ETV Bharat / state

గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలి: సీపీఐ నేత రామకృష్ణ

CPI Protest: గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలపై కుట్ర చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని, ఫెడరల్‌ వ్యవస్థను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాజభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. మోదీ దారిలోనే ఏపీలో సైతం జగన్ పాలన సాగుతుందని రామకృష్ణ ఆక్షేపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకున్న వైకాపా నేతలు అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

CPI protest march in AP
సీపీఐ రాజభవన్ ముట్టడి
author img

By

Published : Dec 29, 2022, 7:12 PM IST

Updated : Dec 29, 2022, 8:27 PM IST

CPI protest march in AP: గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని, ఫెడరల్‌ వ్యవస్థను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాజభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. విజయవాడలోని దాసరి భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతోపాటుగా ఇతర నేతలను జిల్లా జైలు వద్ద అడ్డుకున్న పోలీసులు.. వారిని అరెస్టు చేశారు. మోదీ రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని రామకృష్ణ ధ్వజమెత్తారు. గవర్నర్ వ్యవస్థను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలపై కుట్ర చేస్తున్నారని విమరించారు. ఎమ్మెల్యేలను కొనుక్కుని అడ్డదారిలో అధికారంలోకి వస్తున్నారని ఎద్దేవా చేశారు.

ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ దారిలోనే ఏపీలో సైతం జగన్ పాలన సాగుతుందని ఆక్షేపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకున్న వైకాపా నేతలు అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు. వైకాపా ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించకూడదా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు అనుమతి ఇవ్వరా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్పి మోదీ, జగన్​లు మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

రాజభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన సీపీఐ

'మోదీ రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. గవర్నర్ వ్యవస్థను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. తెలంగాణ, పశ్చిమ బంగ​తో పాటూ అనేక రాష్ట్రాల్లో గవర్నర్​లను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలపై కుట్ర చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కొనుక్కుని అడ్డదారిలో అధికారంలోకి వస్తున్నారు. ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారు. మోదీ దారిలోనే ఏపీలో సైతం జగన్ పాలన సాగుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు'-. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఇవీ చదవండి:

Last Updated : Dec 29, 2022, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.