CPI Porubata from January 17 to 30: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకు జగనన్న ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి, ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. జనవరి 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టనున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. విజయవాడలోని దాసరి భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల స్ధలాల కేటాయింపుల విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వారికి కావాల్సినంత వరకు తినేది తిన్నారన్నారు. పేదలకు ఇవ్వాల్సిన స్థలాల్లో కనీసం సెంటున్నరా అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతరం ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని, పూర్తయిన టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జీవో నెంబర్. 1కి, అడిషనల్ డీజీకి సంబంధం ఏంటని రామకృష్ణ ప్రశ్నించారు. జీవో జారీ చేసిన హోంశాఖ కార్యదర్శి, డీజీపీలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. రోడ్లపై ఎలా ఉండాలో నిబంధనలు ఉన్నాయని, ప్రత్యేకంగా మీరు చెప్పాల్సిన అవసరం ఏంటని సూటిగా ప్రశ్నించారు. జీవోలో అరుదైన పరిస్థితి అనేదాని కంటే అధికార పార్టీ కోసం అని రాసుకుని ఉంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఇప్పటికే పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. భోగి రోజున రాష్ట్రవ్యాప్తంగా భోగి మంటల్లో ఆ జీవో 1 కాపీలను దగ్ధం చేస్తామని మరోసారి ఆయన తేల్చి చెప్పారు.
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా భారత కమ్యునిస్టు పార్టీ, వ్యవసాయ కమిటీ ఆధ్వర్యంలో ఓ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది పేద ప్రజలకు ఇళ్లులేనివారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని చేపబడుతున్నాం.- రామకృష్ణ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి