ETV Bharat / state

Volunteer ki Vandanam: వాలంటీర్లకు వందనం.. లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్​ - వాలంటీర్లకు వందనం కార్యక్రమం

Volunteer ki Vandanam Program: వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉత్తమ సేవలందించిన గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు.. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రదానం చేయనున్నారు.

Volunteer ki Vandanam Program
Volunteer ki Vandanam Program
author img

By

Published : May 19, 2023, 10:05 AM IST

Volunteer ki Vandanam Program Starting Today: "వాలంటీర్లకు వందనం" కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్​ రెడ్డి నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉత్తమ సేవలందించిన గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2లక్షల 33వేల 719 మందికి 243.34 కోట్ల రూపాయల నగదు పురస్కారాలు ఇవ్వనున్నారు.

మే 19వ తారీఖు నుంచి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లకు అవార్డుల ప్రదానం మొదలు కానుంది. కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు అందించనున్నారు. సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు 30వేల రూపాయల నగదు బహుమతిని ఇవ్వనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వాలంటీర్లు.. అంటే 175 నియోజకవర్గాల్లో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. సేవా రత్న కింద సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు 20వేల రూపాయల నగదు బహుమతి అందించనున్నారు. ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 10 మంది చొప్పున టాప్‌ 1 ర్యాంకు సాధించిన వాలంటీర్లకు, మొత్తంగా 4వేల 220 మందికి సేవా రత్న పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

సేవా మిత్ర అవార్డు కింద సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు 10 వేల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పని చేసిన వాలంటీర్లకు 2లక్షల 28వేల 624 మందికి సేవా మిత్ర పురస్కారాల ప్రదానం చేయనున్నారు.

ఏర్పాట్ల పరిశీలన: నగరంలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఈరోజు జరిగే వలంటీర్లకు వందనం కార్యక్రమం ఏర్పాట్లను ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా గురువారం నాడు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరు కానున్న క్రమంలో భద్రతా ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఫంక్షన్‌ హాల్‌ సిట్టింగ్​ కెపాసిటీ, పార్కింగ్‌ ప్రదేశాలు తదితర వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖులు, ప్రజలకు లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.