ETV Bharat / state

అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతి వనం ప్రాజెక్టు పనులపై సీఎం సమీక్ష : అధికారులకు ఆదేశాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 5:57 PM IST

Updated : Nov 27, 2023, 7:34 PM IST

CM Jagan Review Meeting on Ambedkar Smriti Vanam Works: విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో అంబేడ్కర్ విగ్రహం, స్మృతి వనం ప్రాజెక్టు పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నవంబరు 26 తేదీ నాటికే ఈ విగ్రహం ఆవిష్కరించాలని గతంలో నిర్ణయించినా... పనులు పూర్తి కాకపోవటంతో ప్రభుత్వం వాయిదా వేసుకుంది. ఇప్పటికే చాలా సార్లు విగ్రహాన్ని ఆవిష్కరిస్తామంటూ ప్రభుత్వం ప్రకటనలు చేసింది. అయితే వివిధ కారణాలతో విగ్రహ నిర్మాణం పూర్తికాకపోవటంతో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు.

CM Jagan Review Meeting on Ambedkar Smriti Vanam Works
అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతి వనం ప్రాజెక్టు పనులపై సీఎం సమీక్ష : అధికారులకు ఆదేశాలు

CM Jagan Review Meeting on Ambedkar Smriti Vanam Works: విజయవాడలోని స్వరాజ్ మైదాన్ లో చేపట్టిన అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టు పనుల్ని ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) సమీక్షించారు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ పనులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ సమీక్షకు మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, అధికారులు వై. శ్రీలక్ష్మి, ఎపీఐఐసీ ఎండీ ప్రవీణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. దాదాపు 400 కోట్ల రూపాయల వ్యయంతో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నవంబరు 26 తేదీనాటికే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని గతంలో నిర్ణయించినా పనులు పూర్తి కాకపోవటంతో ప్రభుత్వం విగ్రహావిష్కరణను వాయిదా వేసుకుంది. ఇప్పటికే చాలా సార్లు ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామంటూ ప్రభుత్వం ప్రకటనలు చేసింది. అయితే వివిధ కారణాలతో విగ్రహ నిర్మాణం పూర్తికాకపోవటంతో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు.

మహనీయుడి స్మృతివనంలో మద్యం సేవించటమా ?- నాదెండ్ల

జనవరి 15లోపు పనులు పూర్తి చేసేలా చర్యలు: స్మృతివనం, విగ్రహం ప్రారంభించేనాటికి ఎలాంటి పెండింగ్‌ పనులు ఉండకూడదని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వచ్చే రిపబ్లిక్‌డే నాటికి ... పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. జనవరి 15లోపు పనులు పూర్తి చేస్తామని తెలిపిన అధికారులు వెల్లడించారు. జనవరి 24న అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనాన్ని ప్రారంభించే విధంగా సర్వం సిద్ధం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. కృష్ణలంక ప్రాంతంలో... రక్షణ గోడ పొడవునా 1.2 కిలోమీటర్ల మేరకు... సుందీకరణ పనులపై, అధికారులు పలు ప్రతిపాదనలు చేశారు. పార్క్, వాకింగ్‌ ట్రాక్‌ వంటివి ఏర్పాటు చేస్తున్నట్టు సీఎంకు అధికారులు తెలిపారు. పనులు చురుగ్గా సాగుతున్నాయన్నాయని అధికారులు పేర్కొన్నారు. అంబేద్కర్‌ విగ్రహం పీఠం ఎత్తు 81 అడుగులు... విగ్రహం ఎత్తు 125 అడుగులు ఉండనుంది.

అంబేడ్కర్‌ స్మృతివనం, విగ్రహ నిర్మాణాలపై సీఎం జగన్ సమీక్ష

స్మృతివనం పనుల్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి: బడుగు, బలహీనవర్గాలను సమానస్థాయిలో చూడాలన్న అంబేడ్కర్ భావజాలాన్ని ముఖ్యమంత్రి పరిపాలనలో అవలంభిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ చెప్పారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా విజయవాడ నడిబొడ్డున ఎత్తైన విగ్రహంతోపాటు స్మృతి వనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. విజయవాడ పీడబ్ల్యూడీ మైదానంలో అంబేడ్కర్ స్మృతివనం పనుల్ని మరో మంత్రి మేరుగ నాగార్జునతో కలిసి ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ పరిశీలించారు. పనుల పురోగతి తీరును అడిగి తెలుసుకున్నారు. సామాజిక విప్లవానికి నిలువెత్తు దర్పణంగా విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం నిలవనుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అభిప్రాయపడ్డారు. ఈ స్మృతివనాన్ని సాధ్యమైనంత త్వరగా ఆవిష్కరించనున్నామని ఆయన చెప్పారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తున్నట్లు మంత్రి నాగార్జున చెప్పారు.

అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటును 14నెలల్లో పూర్తి చేయాలి: సీఎం

Last Updated : Nov 27, 2023, 7:34 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.