CM Jagan Meeting with Muslim Community: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా నేతృత్వంలో ముస్లిం సంఘాల ప్రతినిధులు, మతపెద్దలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. భేటీలో భాగంగా రాష్ట్రంలో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలు, వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణ, మదరసాలలో పని చేస్తున్న విద్యా వాలంటీర్ల జీతాల చెల్లింపు, ముస్లింల అభ్యన్నతికి సలహాదారు నియామకం, జయహో బీసీ తరహాలో ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఓ భారీ బహిరంగ సభను నిర్వహించే తదితర అంశాలపై రెెండు గంటలపాటు చర్చించారు.
హజ్ హౌస్ నిర్మాణాలకు ఆదేశాలు జారీ: ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ.. వైఎస్సార్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్ నిర్మాణం, విజయవాడలో ఉన్న హజ్ హౌస్ నిర్మాణం, స్ధాయిలో కమిటీల ఏర్పాటు, మదరసాలలో పని చేస్తున్న విద్యా వాలంటీర్ల జీతాలు పెంచాలని, నిర్మాణాలు చేపట్టాలని సీఎం జగన్‌ని కోరారు. స్పందించి సీఎం జగన్.. వైఎస్సార్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్ నిర్మాణాం, విజయవాడలోని హజ్ హౌస్ నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించి, నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు అన్ని మతాల భూముల పరిరక్షణకు జిల్లా స్థాయిలో కమిటీలు నియమించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ప్రతి జిల్లా స్ధాయిలో కమిటీల ఏర్పాటు, కలెక్టర్ల ఆధ్వర్యంలో జేసీ, ఏఎస్పీలతో ఒక కమిటీ వేసి.. ఒక సమన్వయకమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఖాజీల పదవీ కాలం 3 నుంచి 10 ఏళ్లకు పెంపు: సమావేశం అనంతరం ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. ఖాజీల పదవీ కాలాన్ని మూడేళ్ల నుంచి పదేళ్లకు పెంచాలన్న ప్రతిపాదనపై సీఎం జగన్ సుముఖత వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. మదరసాలలో పని చేస్తున్న విద్యావాలంటీర్ల జీతాల సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఉర్ధూ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నాటికి బైలింగువల్ టెక్ట్స్ బుక్స్‌లో భాగంగా ఇంగ్లిషుతోపాటు ఉర్ధూలో కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని, కర్నూలులో ఉర్దూ వర్సిటీ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని, ఖాజీల పదవీ కాలాన్ని 3 నుంచి 10 ఏళ్లకు పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారని వెల్లడించారు. చట్ట సభల్లో ముస్లిం మైనారిటీలకు రాజకీయ పదవులు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని సమావేశం ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు.
సీఎం జగన్ తిరువూరు పర్యటన ఖరారు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పర్యటన ఖరారైంది. ఈ నెల 18వ తేదీన విద్యా దీవెన పథకాన్ని ఆయన తిరువూరులో బటన్ నొక్కి ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన ఖరారైన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. తిరువూరు పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డులో గల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం పక్కన గల ఖాళీ ప్రదేశంలో సభా వేదికను సిద్ధం చేస్తున్నారు.
ఈ క్రమంలో డోజర్లతో స్థలం చదును చేసే పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. దారా పూర్ణయ్య టౌన్ షిప్‌లో హెలిప్యాడ్ నిమిత్తం స్థలం ఎంపిక చేశారు. సభావేదిక, హెలిప్యాడ్ వద్ద జరుగుతున్న పనులను ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి నియోజకవర్గం నాయకులతో కలిసి సోమవారం పర్యవేక్షించారు. అంతకుముందు నియోజకవర్గం కార్యాలయంలో నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమం విజయవంతానికి సమన్వయ కమిటీని నియమించారు. విద్యార్థులతో పాటు పార్టీ శ్రేణులను పెద్ద ఎత్తున తరలించి విజయవంతం చేయాలని కోరారు.
ఇవీ చదవండి