ETV Bharat / state

CM Jagan Cheating Middle class People : 'జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌' పేరుతో సీఎం జగన్ బురిడీ.. మధ్యతరగతికి వంచన! - CM Jagan Buridi in the Name of Smart Townships

CM Jagan Cheating Middle class People in the Name of Smart Townships: మధ్య తరగతి ప్రజలకు స్మార్ట్ టౌన్‌షిప్‌లంటూ.. రెండేళ్లక్రితం రంగుల స్వప్నాలు చూపించిన ముఖ్యమంత్రి జగన్‌‌పై ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మధ్య ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి.. మోసం చేశారని ఆగ్రహిస్తున్నారు. సీఎం జగన్.. మధ్య తరగతి ప్రజలకిచ్చిన హామీని నేరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

CM_Jagan_Buridi_in_Smart_Townships
CM_Jagan_Buridi_in_Smart_Townships
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2023, 12:23 PM IST

CM Jagan Cheating Middle call People in the Name of Smart Townships : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మధ్యతరగతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌'ల పేరుతో హామీలిచ్చి.. దారుణంగా మోసం చేశారని ఆవేదన చెందుతున్నారు. హామీ ప్రకటనలు చేసి రెండేళ్లు గడిచినా.. ఇప్పటివరకూ భూ సేకరణ పూర్తికాలేదని దుయ్యబడుతున్నారు. కొన్ని చోట్ల హడావుడిగా లేఅవుట్లలో పనులు ప్రారంభించినప్పటికీ.. అవి మధ్యలోనే ఆగిపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ సభల్లో మాట తప్పను-మడమ తిప్పనని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి జగన్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హితవు పలుకుతున్నారు.

CM Jagan Cheating Middle class People : 'జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల' పేరుతో సీఎం జగన్ బురిడీ.. మధ్యతరగతికి వంచన!

Jagananna Smart Township Updates: స్మార్ట్ టౌన్‌షిప్‌లంటూ సీఎం జగన్ మధ్యతరగతి ప్రజలను బురిడీ కొట్టించారు. రెండేళ్లక్రితం రంగుల స్వప్నాలు చూపించిన ముఖ్యమంత్రి జగన్‌..తాజాగా ప్లేటు తిప్పేశారు. హామీ ప్రకటనలు చేసి రెండేళ్లయినా ఇప్పటివరకూ భూసేకరణ కూడా పూర్తి కాలేదు. కొన్ని చోట్ల హడావుడిగా లేఅవుట్ల పనులు ప్రారంభించినా.. మధ్యలోనే ఆగిపోయి.. అడుగు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. ఫలితంగా డబ్బులు చెల్లించి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు అయోమయంలో పడిపోయారు.

CM Jagan Negligence on Smart Cities: స్మార్ట్ సిటీలపై వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం.. మాటల్లోని అభివృద్ధి చేతల్లో ఏదీ..?

Middle Class People Fire on CM Jagan: మధ్య ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని.. హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి జగన్‌.. చివరకు చేతులెత్తేశారు. మాట తప్పను.. మడమ తిప్పను అంటూ నమ్మబలికి మధ్య తరగతి ప్రజల ఆశలను ఆవిరి చేశారు. రియల్టర్లకు మించి M.I.G. లేఅవుట్లపై ముఖ్యమంత్రే స్వయంగా ప్రచారం చేయడంతో.. ప్రజలు నమ్మి పెద్ద ఎత్తున దరఖాస్తులు చేశారు. దీంతో అరకొరగా ప్రారంభించిన లేఅవుట్లలోనూ రెండేళ్లయినా పనులు పూర్తి కాలేదు. అత్యధిక చోట్ల అసలు పనులే మొదలు కాలేదు. ఇంటి స్థలం విలువలో 10 శాతం నగదు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రజలకు ప్లాట్లు ఇవిగో, అవిగో అంటూ చుక్కలు చూపిస్తున్నారు.

Jagan Guarantees Limited to Advertisements: నగరాలు, పట్టణాల్లో లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మొదట ప్రకటించిన ముఖ్యమంత్రి.. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఇది ప్రజలను నమ్మించి మోసం చేయడం కాదా జగన్‌..? వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో స్వగృహ ప్రాజెక్టు పేరుతో మధ్య తరగతి కుటుంబాలకు అరచేతిలో స్వర్గం చూపించినట్లు.. ఇప్పుడు ఆయన కుమారుడు జగన్‌ హయాంలోనూ తిప్పలు తప్పవా..? అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Dalit farmers fire on YSRCP: జగనన్న స్మార్ట్ సిటీ పేరుతో అధికార పార్టీ నేతల బెదిరింపులు.. భూములు ఇవ్వాలంటూ నోటీసులు

Krishna District Home Places Updates: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇళ్ల స్థలాల కోసం దాదాపు 2వేల 600 మంది ముందుకొచ్చారు. నగరానికి సమీపంలో ప్రైవేటు భూముల ధరలు భారీగా ఉండటంతో.. లేఅవుట్ వేసేందుకు అధికారులు ముందడుగు వేయడం లేదు. గుడివాడలో ఇళ్ల స్థలాల కోసం 3వేల 800 మంది దరఖాస్తులు అందించారు. దొండపాడు-వలిపర్తిపాడు మధ్య దాదాపు 40 ఎకరాల రైతుల భూములను అధికారులు పరిశీలించారు.

Kurnool District Home Places Updates: కర్నూలు జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం 15వేల 600 దరఖాస్తులొచ్చాయి. 500 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనాకు వచ్చారు. ఏడాదైనా భూసేకరణ ప్రారంభం కాలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రజల నుంచి స్పందనే లేదు. కందుకూరులో దరఖాస్తు చేసుకున్న 292 మందిలోనూ 59 మంది మాత్రమే ప్లాట్‌ విలువలో 10 శాతం మొత్తాన్ని చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో 11 వందల 12 ఇళ్ల స్థలాలకు వీలుగా లేఅవుట్‌ అభివృద్ధి పనులు చేపడుతున్నా.. వీటిలో నాణ్యత లోపిస్తోందన్న ఫిర్యాదులొస్తున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా.. పార్వతీపురం, బొబ్బిలిలో స్థలాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులొచ్చినా.. లేఅవుట్ల ఏర్పాటుకు ముందడుగు పడలేదు.

Layout Work has Stopped in Mangalagiri: రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సీఆర్డీఏ పరిధిలోని మంగళగిరి సమీపంలో ఉన్న నవులూరులో M.I.G. లేఅవుట్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. దాదాపు 81 ఎకరాల్లో 528 ప్లాట్లు మధ్య తరగతి ప్రజలకు కేటాయించాలన్నది ప్రతిపాదన. అధికారులు ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి దరఖాస్తులు రాలేదు. ప్రజలను ఆకర్షించేందుకు ప్రతిపాదిత భూముల్లో ఎప్పటికప్పుడు లేఅవుట్ పనులు చేయడం.. మళ్లీ నిలిపివేయడం సర్వసాధారణమవుతోంది.

Officials have Started Layout Works at Six Places: విశాఖ మెట్రో ప్రాంతీయ అభివృద్ధి సంస్థ-VMRDA పరిధిలో ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులపై ఆరు చోట్ల లేఅవుట్ల పనులు ప్రారంభించారు. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో వీటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. 15 వందల 5 ప్లాట్లు వీటిలో సిద్ధం చేయాలన్నది ప్రణాళిక. స్థలాల కోసం మొదట ఎంతో ఆసక్తి చూపిన ప్రజలు తరువాత ప్లాట్‌ విలువలో 10 శాతం నగదు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. మొత్తం వెయ్యీ 8 దరఖాస్తుదారుల్లో 367 మంది మాత్రమే ఇప్పటి వరకు నగదు చెల్లించారు.

Township Details Kept Confidential by Govt: మధ్య తరగతి కుటుంబాల కోసం ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌కి సంబంధించిన వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. 150, 200, 240 చదరపు అడుగుల్లో ప్లాట్లు మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో ఇస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులెన్ని..? ప్లాట్ విలువలో 10 శాతం మొత్తం చెల్లించిన వారెందరు..? ఇలా వచ్చిన మొత్తం ఎంత? లేఅవుట్ల ఏర్పాటుకు ఎన్ని చోట్ల భూ సేకరణ పూర్తయింది..? ప్రారంభించిన లేఅవుట్ల వివరాలను అధికారులు బయటపెట్టడం లేదు.

Smart Cities Works in AP: ఏ అభివృద్ధైనా సరే.. మాట ఇచ్చాడా.. మడమ తిప్పినట్లే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.