ETV Bharat / state

అభ్యర్ధులూ ఇది గమనించండి.. గ్రూప్ 2 పరీక్షా విధానంలో మార్పులు

Changes in APPSC Group 2 Exam Pattern: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షా విధానంలో మార్పులు జరిగాయి. ఇక నుంచి మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు.. 300 మార్కులకు ఉండనున్నాయి. ఏపీ సామాజిక చరిత్ర, ఉద్యమాలు, భారతరాజ్యాగం పేపర్​ 1గా 150 మార్కులకు.. రెండో పేపర్​లో భారత, ఏపీ ఎకానమి, సైన్స్ అండ్ టెక్నాలజీ 150 మార్కులకు ఉండనుంది. గత విధానం తరహాలోనే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.

appsc
ఏపీపీఎస్సీ
author img

By

Published : Jan 7, 2023, 12:30 PM IST

Updated : Jan 7, 2023, 2:14 PM IST

Changes in APPSC Group 2 Exam Pattern: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రిలిమ్స్ పరీక్షతో పాటు మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు మాత్రమే ఉండేలా మార్పులు చేస్తూ ఆ శాఖ మానవ వనరుల విభాగం కార్యదర్శి చిరంజీవి చౌదరి ఉత్తర్వులు ఇచ్చారు. గత విధానం తరహాలోనే ప్రిలిమినరీ పరీక్షలో.. 150 మార్కులకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే మెయిన్స్​లో 450 మార్కులకు 3 పేపర్లు బదులుగా.. ఇక నుంచి 300 మార్కులకు రెండు పేపర్లు మాత్రమే ఉండేలా మార్పులు చేశారు. ఈమేరకు ఏపీపీఎస్సీ బోర్డు సభ్యులు చేసిన సిఫార్సుల మేరకు ఈ మార్పు చేర్పులు చేసినట్టుగా ప్రభుత్వం తెలియచేసింది. గ్రూప్ 2 మెయిన్స్​లో ఏపీ సామాజిక చరిత్ర, ఉద్యమాలు, భారతరాజ్యాగం పేపర్​ 1గా 150 మార్కులకు ప్రశ్నాపత్రం ఉండనుంది. అలాగే మరో 150 మార్కులకు రెండో ప్రశ్నాపత్రంగా భారత, ఏపీ ఎకానమి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుందని ప్రభుత్వం పేర్కోంది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 7, 2023, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.